మహేష్‌తో కోల్డ్‌వార్ కంటిన్యూ.. ఫ్రెండ్స్‌నూ పట్టించుకోని సుకుమార్..?

మహేష్ బాబు- సుకుమార్.. అన్ని కుదిరినట్లైయితే ఈ కాంబినేషన్లో రెండో మూవీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. స్క్రిప్ట్ విషయంలో మహేష్‌, సుకుమార్‌ ఇద్దరికీ అభిప్రాయబేధాలు రావడంతోనే ఈ సినిమా ఆగిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దానికి తోడు మహేష్‌ తీరుతో చిన్నబుచ్చుకున్న సుకుమార్, అతడికి చెప్పకుండానే బన్నీతో నెక్ట్స్ సినిమాను ప్రకటించడం అటు మహేష్‌ను కూడా ఇబ్బంది పెట్టిందన్న గాసిప్‌లు […]

మహేష్‌తో కోల్డ్‌వార్ కంటిన్యూ.. ఫ్రెండ్స్‌నూ పట్టించుకోని సుకుమార్..?
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Jan 14, 2020 | 11:17 AM

మహేష్ బాబు- సుకుమార్.. అన్ని కుదిరినట్లైయితే ఈ కాంబినేషన్లో రెండో మూవీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. స్క్రిప్ట్ విషయంలో మహేష్‌, సుకుమార్‌ ఇద్దరికీ అభిప్రాయబేధాలు రావడంతోనే ఈ సినిమా ఆగిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దానికి తోడు మహేష్‌ తీరుతో చిన్నబుచ్చుకున్న సుకుమార్, అతడికి చెప్పకుండానే బన్నీతో నెక్ట్స్ సినిమాను ప్రకటించడం అటు మహేష్‌ను కూడా ఇబ్బంది పెట్టిందన్న గాసిప్‌లు వినిపించాయి. ఏదైతేనేం ఈ క్రేజీ కాంబోలో మరో సినిమాను చూద్దామనుకున్న ప్రేక్షకులకు మాత్రం పెద్ద షాకిచ్చారు వీరిద్దరు.

ఇదిలా ఉంటే ఏడాది గడిచినా.. ఈ ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ కంటిన్యూ అవుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయానికొస్తే.. సంక్రాంతి బరిలో మహేష్, బన్నీ ఇద్దరు పోటీ పడ్డ విషయం తెలిసిందే. మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలతో ఒకరోజు గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలకు అభిమానుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. దీంతో కలెక్షన్ల పరంగానూ రెండు చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఇక తాజాగా అల వైకుంఠపురములో సినిమాను చూసిన సుకుమార్.. దానిపై సోషల్ మీడియాలో స్పందించారు. సినిమా చాలా బావుందంటూ టీమ్ మొత్తానికి కితాబిచ్చారు. ఈ సందర్భంగా బన్నీతో తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు. కానీ మహేష్ సినిమాపై మాత్రం ఆయన స్పందించలేదు. ఇంకా చెప్పాలంటే సరిలేరు నీకెవ్వరుకు సుకుమార్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన దేవీ శ్రీ ప్రసాద్, రత్నవేలు ఇద్దరు పనిచేశారు. అయినా ఆ సినిమాను ఇంకా చూడలేదో..? ఏమో తెలీదు గానీ..? సరిలేరు నీకెవ్వరుపై సుకుమార్ స్పందించకపోవడంతో.. వీరిద్దరి మధ్య ఇంకా కోల్డ్‌వార్ కంటిన్యూ అవుతుందని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. త్వరలోనే ఇందులో జాయిన్ అవ్వనున్నారు బన్నీ. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu