ట్విట్టర్‌లో ‘చిరు’ సరసాలు.. మోహన్‌బాబు, పూరీలకు ఆసక్తికర సమాధానం..!
ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అందులో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న చిరు.. తన అభిప్రాయలను వ్యక్తపరుస్తూ వస్తున్నారు.
ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అందులో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న చిరు.. తన అభిప్రాయలను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చిరు ఎంట్రీకి స్వాగతం పలుకుతూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి సమాధానం కూడా ఇస్తున్నారు మెగాస్టార్. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు మోహన్ బాబుకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు మెగాస్టార్. మిత్రమా వెల్‌కమ్ అంటూ మోహన్ బాబు వేసిన ట్వీట్‌కు.. థ్యాంక్యు మిత్రమా..! రాననుకున్నావా.. రాలేననుకున్నావా..? అని ఇంద్ర డైలాగ్‌తో రిప్లై ఇచ్చారు చిరు.
Thank you Mitrama @themohanbabu Raananu kunnava.. raalenanukunnava? 🙂 https://t.co/RtulyJ13AU
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2020
కాగా ఒకప్పుడు టాలీవుడ్‌లో టామ్ అండ్ జెర్రీలుగా ఉండేవారు చిరు, మోహన్ బాబు. చిరుపై బహిరంగంగానే పలుమార్లు కామెంట్లు చేశారు మోహన్ బాబు. కానీ ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం చాలా పెరిగింది. మా డైరీ ఆవిష్కరణలో భాగంగా మోహన్ బాబు తనకు సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతున్న సమయంలో.. చిరు వెనుక నుంచి వచ్చి ఆయనను కౌగలించుకోవడంతో పాటు ముద్దు కూడా పెట్టారు. అంతకుముందు ఓ అవార్డు కార్యక్రమంలోనూ వయో వృద్ధులు అంటూ మోహన్ బాబుపై ఛలోక్తులు విసిరారు. ఇక చిరుపై కూడా మోహన్ బాబు ఓసారి సెటైర్లు వేశారు. బయట పులిలాగా కనిపించినా.. ఇంట్లో తన చెల్లి సురేఖ దగ్గర చిరు పిల్లిలా ఉంటారని ఆయన అన్నారు. దీనిపై చిరు ఆ విషయం చెప్పకంటూ నవ్వుతూ కౌంటర్ వేశారు. ఆ సంభాషణకు అక్కడున్న అందరూ నవ్వుకున్న విషయం తెలిసిందే.
ఇక మరోవైపు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కూడా చిరు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. చిరంజీవి సర్ సోషల్ మీడియాలోకి మీకు స్వాగతం. బయటంతా సోషల్ డిస్టేన్స్ మెయింటెన్ చేస్తోన్న సమయంలో.. సోషల్ మీడియా మిమ్మల్ని మాకు దగ్గర చేస్తోంది అని ట్వీట్ పెట్టారు. దానికి స్పందించిన చిరు.. థ్యాంక్యు పూరీ.. ఇక్కడ మంచి ఫ్యామిలీ టైమ్ దొరుకుతుందనుకుంటున్నా. నువ్వు ముంబయి, బ్యాంకాక్ బీచ్‌లను ఇప్పుడు మిస్ అవుతూ ఉండచ్చు.. కానీ ఆకాశ్, పవిత్రలకు నీతో సమయాన్ని వెచ్చించే అవకాశం వచ్చింది అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు మెగాస్టార్. కాగా చిరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో ఆయన ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు.
Read This Story Also: కరోనాపై యుద్ధం.. టాలీవుడ్ సెలబ్రిటీల ఔదార్యం.. భారీ విరాళం..!
Thank you @purijagan Also it allows some great family time. You may be missing the beaches of Mumbai and Bangkok, but I am sure Pavitra and Aakash will be so happy to see you spending time at home . https://t.co/NXiPjDoV2O
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2020