చిరు మూవీలో చెర్రీ రోల్ ఇదేనా.. మెగా ఫ్యాన్స్ ఒప్పకుంటారా..!
మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆచార్య అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆచార్య అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా చిరుతో రెండోసారి జత కట్టబోతుండగా.. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీలో చెర్రీ పాత్రకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో చెర్రీ మాజీ నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారట. ఈ పాత్ర 30 నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది.
అంతేకాదు ఓ మిషన్ మీద వెళ్లిన చెర్రీ.. దాన్ని పూర్తి చేయకుండానే చచ్చిపోతాడట. ఇక ఆ తరువాత చెర్రీ కోరికను చిరు పూర్తి చేస్తాడని సమాచారం. ఇక ఈ పాత్ర సినిమాకు కీలకం కానుందని తెలుస్తోంది. ఈ పాత్రను విన్న వెంటనే చిరు, చెర్రీనే అనుకున్నారట. ఇంతవరకు రామ్ చరణ్ ఇలాంటి పాత్ర చేయకపోగా.. ఈ పాత్రకు తన కుమారుడు కరెక్ట్‌గా ఉంటాడని ఆయన భావించారట. ఈ క్రమంలో చివరకు చెర్రీనే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఏ చిత్రం మామూలుగా ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ.. కరోనా నేపథ్యంలో సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.