AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై యుద్ధం.. టాలీవుడ్ సెలబ్రిటీల ఔదార్యం.. ఏ స్టార్ ఎంత ఇచ్చారంటే..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై దేశాధినేతలు యుద్దం ప్రకటించారు. ఈ మహమ్మారి ఆటను ఎలాగైనా కట్టేయాలని వారందరూ దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తున్నారు.

కరోనాపై యుద్ధం.. టాలీవుడ్ సెలబ్రిటీల ఔదార్యం.. ఏ స్టార్ ఎంత ఇచ్చారంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 26, 2020 | 8:03 PM

Share

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై దేశాధినేతలు యుద్దం ప్రకటించారు. ఈ మహమ్మారి ఆటను ఎలాగైనా కట్టేయాలని వారందరూ దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భారత్‌ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. వచ్చే నెల 15వరకు అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని ఆయన సూచించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మోదీ ఇచ్చిన సూచన మేరకు ప్రజలు బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఈ మహమ్మారిపై ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధానికి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. మొదట నితిన్, ఆ తరువాత పవన్ కల్యాణ్.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు ఇవ్వగా.. తాజాగా ఆ లిస్ట్‌లో మరికొందరు చేరారు.

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు.. ఇరు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే ఆర్ఆర్ఆర్ హీరోలైన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రూ.70లక్షల రూపాయలు, ఎన్టీఆర్ రూ.75లక్షలు ప్రకటించారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కోటి రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.  అలాగే సాయి ధరమ్ తేజ్ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.5లక్షలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.10లక్షలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇక దర్శకులు త్రివిక్రమ్‌ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.10లక్షలు, కొరటాల శివ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.5లక్షలు అనిల్ రావిపూడి ఇరు రాష్ట్రాలకు చెరో రూ.5లక్షలు తన వంతు సహాయం ప్రకటించారు సినీ ప్రముఖులు. ఇక నాంది సినిమా నటుడు, నిర్మాత అల్లరి నరేష్, సతీష్ వేగేష్న సైతం తన నాంది సినిమా కోసం పనిచేస్తున్న 50 మందికి పైగా సినీ కార్మికులకు 10వేల రూపాయాలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఒకడుగు ముందుకేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ కార్మికుల కోసం రూ.కోటి రూపాయలను ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక రాజశేఖర్ దంపతులు కూడా తమ ఫౌండేషన్ ద్వారా సినీ కార్మికులకు రోజువారీ సరుకులు ఇస్తామని తెలిసిన విషయం తెలిసిందే. ఏదేమైనా సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ మేమున్నామంటూ రియల్ హీరోలుగా ముందుకొస్తోన్న మన టాలీవుడ్ ప్రముఖులకు హ్యాట్సాఫ్.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్ః హృతిక్ ఇంటికి చేరుకున్న మాజీ భార్య..!

Follow Us
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..