The Kashmir Files: మోడీ మెచ్చిన చిన్న సినిమా.. ఇప్పుడు ఏకంగా కొత్త చరిత్రనే సృష్టిస్తోందిగా..

'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 3 రోజుల్లో బిజినెస్ 325% పెరిగిన మొదటి బాలీవుడ్ సినిమా గా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ.

The Kashmir Files: మోడీ మెచ్చిన చిన్న సినిమా.. ఇప్పుడు ఏకంగా కొత్త చరిత్రనే సృష్టిస్తోందిగా..
The Kashmir Files
Follow us

|

Updated on: Mar 14, 2022 | 5:17 PM

The Kashmir Files: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 3 రోజుల్లో బిజినెస్ 325% పెరిగిన మొదటి బాలీవుడ్ సినిమా గా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. మార్చి 11న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు దాదాపు 3.5 కోట్లు కాగా, రెండో రోజు 8.5 కోట్లు, మూడో రోజు 15.10 కోట్లకు చేరుకుంది. తొలిరోజు దేశవ్యాప్తంగా 600 స్క్రీన్లలో మాత్రమే రిలీజ్ అయినా ఈ సినిమా ఆదివారం నాటికి సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న మక్కువ చూసి ఏకంగా 2000 స్క్రీన్స్ కు చేరుకుంది. సినిమా షోలు కూడా ప్రతి నగరంలో రెట్టింపు అయ్యాయి. పెద్ద స్టార్లు లేకుండా దాదాపు 12 కోట్ల రూపాయలతో 27 కోట్లకు పైగా బిజినెస్ చేసింది ‘ది కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ఈమూవీ కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే కథ ఇది . ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ తోపాటు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసించారు. అలాగే సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విపరీతమైన ప్రశంసలు అందుకోవడంతో ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.

అలియా భట్-అజయ్ దేవగన్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలైంది. అయితే ది కాశ్మీర్ ఫైల్స్  సినిమా గంగూబాయి కతియావాడి’ కలెక్షన్‌కు పోటీగా నిలిచింది. పెద్ద బ్యానర్ ,స్టార్‌కాస్ట్ కారణంగా గంగూబాయి  3600 స్క్రీన్‌లలో విడుదలైంది. ఆ తర్వాత మొదటి రోజు దాదాపు 10 కోట్ల కలెక్షన్లు రాగా, మొదటి వీకెండ్ కలెక్షన్ 39 కోట్లకు చేరువైంది. అదే సమయంలో, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ గంగూబాయి కంటే పెద్ద హిట్‌గా నిలిచింది, చాలా తక్కువ స్క్రీన్‌లు వచ్చినా కూడా మొదటి వారాంతంలో 27 కోట్లు రాబట్టింది. మార్చి 11 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు భారతదేశంలో 3 రోజుల్లో అంటే మొదటి వారాంతంలో మొత్తం 27.15 కోట్లను వసూలు చేసింది. విడుదలైన మూడో రోజు (ఆదివారం) రూ.15.10 కోట్లు, రెండో రోజు (శనివారం) రూ.8.50 కోట్లు, మొదటి రోజు (శుక్రవారం) రూ.3.55 కోట్లు రాబట్టింది. అంటే మూడో రోజు ఈ సినిమా బిజినెస్‌లో 325.35 శాతం  అంటే రూ.23.6 కోట్ల బిజినెస్ జరిగింది.రెండో రోజు కూడా ఈ సినిమా బిజినెస్‌లో 139.44 శాతం గ్రోత్ వచ్చింది,  2020 తరవాత ఏ సినిమా ఇంత గ్రోత్ ను సాధించలేదు. ఈ సినిమా 70-100 కోట్ల లైఫ్‌టైమ్ నెట్ వసూళ్లు రాబట్టగలదని ట్రేడ్ అనలిస్ట్ లు అంచనా వేస్తున్నారు. అనుపమ్ ఖేర్‌తో పాటు, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి, పునీత్ ఇస్సార్, మృణాల్ కులకర్ణి సహా పలువురు నటీనటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bahubali 3: మాహిష్మతి రాజ్యం నుంచి కొత్త వార్త రానుంది.. బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు..

హర్మోనియం మెట్ల మీద ఆయన చేతి వేళ్లు కదిలితే చాలు సప్తస్వరాలు తుళ్లిపడేవి!

NTR: అన్న గారి ఫొటో వెనుక గమ్మత్తైన విషయం దాగి ఉంది.. ఏంటో గుర్తు పట్టండి..