The Kashmir Files: కశ్మీర్ మారణహోమాన్ని అధికారికంగా గుర్తించిన USA రోడ్ ఐలాండ్..

The Kashmir Files: వివేక్ అగ్నిహోత్రి చిత్రం ' ది కాశ్మీర్ ఫైల్స్ ' విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. అయితే USలోని

The Kashmir Files: కశ్మీర్ మారణహోమాన్ని అధికారికంగా గుర్తించిన USA రోడ్ ఐలాండ్..
The Kashmir Files
Follow us
uppula Raju

|

Updated on: Mar 15, 2022 | 5:38 AM

The Kashmir Files: వివేక్ అగ్నిహోత్రి చిత్రం ‘ ది కాశ్మీర్ ఫైల్స్ ‘ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. అయితే USలోని రోడ్ ఐలాండ్ రాష్ట్రం మొదటిసారిగా కాశ్మీర్ మారణహోమాన్ని అధికారికంగా గుర్తించింది. ఈ విషయాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అనుపమ్ ఖేర్ నటించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ 1989 నాటి కశ్మీరీ పండిట్ల వలసల ఆధారంగా రూపొందించారు. ఇది బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శనతో కొనసాగుతోంది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం ఈ చిత్రం 3వ రోజు 325.35 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ దిగ్గజ నటులు మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషిలు కీలక పాత్రల్లో నటించారు. మార్చి11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు హరియానా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు కూడా తమవంతు సాయంగా పన్ను రాయితీని ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

మన దేశంలోని కశ్మీర్‌ ప్రాంతంలో జరిగిన ఈ అత్యంత భయానకమైన ఘటనను వెండితెరపై చూపించడం అంత సులువుగా జరగలేదు. దర్శక నిర్మాతలకు ఈ సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు ఆపేయమని బెదిరింపు కాల్స్‌ కూడా వచ్చాయి. ఈ మూవీని అడ్డుకోవడానికి కోర్టులో వ్యాజ్యాలు సైతం వేశారు. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని డైరెక్టర్ వివేక్‌ అగ్నిహోత్రి ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ను ఉన్నది ఉన్నట్లుగా నటీనటుల సహకారంతో వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ప్రతీ సన్నివేశం, నటీనటుల భావోద్వేగపు యాక్టింగ్‌ ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు.

Minister Perni Nani Comments: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఫైర్..

Women Health: 30 ఏళ్లు దాటిన మహిళలకు ఇవి తప్పనిసరి.. అప్పుడే ఈ రోగాలు దూరం..!

ఈ పథకంలో నెల నెలా రూ.10,000 డిపాజిట్‌ చేయండి.. సులభంగా రూ.16 లక్షలు పొందండి..!