AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health: 30 ఏళ్లు దాటిన మహిళలకు ఇవి తప్పనిసరి.. అప్పుడే ఈ రోగాలు దూరం..!

Women Health: 30 ఏళ్ల తర్వాత స్త్రీల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. 40 ఏళ్లు వచ్చేసరికి కండరాలు పటుత్వం కోల్పోతాయి. హార్మోన్లు అసమతుల్యతగా ఉంటాయి.

Women Health: 30 ఏళ్లు దాటిన మహిళలకు ఇవి తప్పనిసరి.. అప్పుడే ఈ రోగాలు దూరం..!
Women Over Age Of 30
uppula Raju
|

Updated on: Mar 14, 2022 | 6:17 AM

Share

Women Health: 30 ఏళ్ల తర్వాత స్త్రీల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. 40 ఏళ్లు వచ్చేసరికి కండరాలు పటుత్వం కోల్పోతాయి. హార్మోన్లు అసమతుల్యతగా ఉంటాయి. కొంతమంది మహిళలు విపరీతంగా బరువు పెరుగుతారు. అనేక వ్యాధులు చుట్టుముడుతాయి. వీటిలో అధిక రక్తపోటు, థైరాయిడ్, మధుమేహం, ఊబకాయం, మానసిక సమస్యలు మొదలైనవి ఉంటాయి. అందువల్ల మహిళలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి అన్ని పోషకాలు ఉన్న ఆహారాలని తినాలి. మంచి ఆహారం, మంచి నిద్ర, ఒత్తిడి లేని జీవితంతో పాటు, రోజూ కొన్ని వ్యాయామాలు చేయాలి. 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు తప్పనిసరిగా తినవలసిన ఆహారాల గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనది వెల్లుల్లి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉన్న వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అన్ని వయసుల వారికి మేలు చేస్తుంది. కానీ 40 ఏళ్ల తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి సమస్య పెరుగుతుంది. దీని బారి నుంచి వెల్లుల్లి కాపాడుతుంది. అంతేకాకుండా వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్ వెజిటేబుల్స్ మీకు ఐరన్, జింక్, విటమిన్ కె, లుటిన్, ఫోలేట్, కాల్షియం, బీటా కెరోటిన్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇవి మీ శరీరంలో రక్తాన్ని పెంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి.

డార్క్ చాక్లెట్: మహిళలు 30 సంవత్సరాల తర్వాత చాక్లెట్లు తినాలనుకుంటే ఎల్లప్పుడూ డార్క్ చాక్లెట్లను తినాలి. ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

గుడ్లు: గుడ్లలో విటమిన్ డి ఉంటుంది కాబట్టి మహిళలు గుడ్లు తప్పనిసరిగా తినాలి. ఇది కాకుండా గుడ్డు మంచి కొవ్వు, ప్రోటీన్లకు మూలం. రోజువారీ ఆహారంలో కనీసం 1 నుంచి 2 గుడ్లు చేర్చుకుంటే మంచిది.

సిట్రస్ పండ్లు: అన్ని రకాల సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Russia Ukraine War: ఉక్రెయిన్‌ దాడుల్లో అమెరికన్‌ జర్నలిస్ట్‌ మృతి.. మరొకరి తీవ్ర గాయాలు..

CBSE: పదో తరగతి విద్యార్థులకి షాక్.. అవి రిజల్ట్‌ కాదు.. థియరీ మార్కులు మాత్రమే..

Sonia Gandhi: కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియానే.. సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు..