Health: ఈ రెండు పండ్లని ఎప్పుడు కలిపి తినకూడదు.. ఆరోగ్యానికి మంచిది కాదు..!

Health: బొప్పాయిలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది ఎక్కడైనా చాలా తేలికగా తక్కువ ధరకే లభిస్తుంది. బొప్పాయిని రెగ్యులర్‌గా తింటే పొట్ట సమస్యలు నయమవుతాయి.

Health: ఈ రెండు పండ్లని ఎప్పుడు కలిపి తినకూడదు.. ఆరోగ్యానికి మంచిది కాదు..!
Banana And Papaya
Follow us
uppula Raju

|

Updated on: Mar 14, 2022 | 6:05 AM

Health: బొప్పాయిలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది ఎక్కడైనా చాలా తేలికగా తక్కువ ధరకే లభిస్తుంది. బొప్పాయిని రెగ్యులర్‌గా తింటే పొట్ట సమస్యలు నయమవుతాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బొప్పాయిని పచ్చిగా లేదా వండిన రూపంలో తీసుకుంటారు. మరోవైపు అరటి గురించి మాట్లాడినట్లయితే ఇందులో పోషకాలు ఎక్కవు. అరటిపండ్లను తీసుకోవడం ద్వారా శరీరానికి పొటాషియం పుష్కలంగా దొరుకుతుంది. ఇది కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే అరటిపండు, బొప్పాయిని కలిపి తినవచ్చా? రెండూ కలిపి తినడం వల్ల వచ్చే నష్టమేంటి? ఆ విషయాల గురించి తెలుసుకుందాం. అరటిపండు, బొప్పాయిని కలిపి తినడం అనేది మీ జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో జీర్ణశక్తి బలహీనంగా ఉంటుంది కాబట్టి అరటిపండు, బొప్పాయి కలిపి తింటే సమస్యలు ఎదురవుతాయి. మంచి జీర్ణశక్తి ఉన్నవారికి ఈ సమస్య ఉండదు. ఆయుర్వేదం ప్రకారం అరటి, బొప్పాయి ఒకదానికొకటి వ్యతిరేక పండ్లుగా పరిగణిస్తారు. అందుకే ఆయుర్వేదం వీటిని కలిపి తినమని సూచించదు. ఒకవేళ ఇలా తింటే జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు ఏర్పుడుతాయి. అజీర్ణం, వాంతులు, వికారం, గ్యాస్, తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి.

శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు బొప్పాయిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాలి. బొప్పాయిలో పపాన్ అనే మూలకం ఉంటుంది. దీని కారణంగా కొంతమంది అలెర్జీకి గురవుతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. జాండిస్ రోగులు బొప్పాయి అస్సలు తినకూడదని సూచిస్తారు. ఇందులో ఉండే పపైన్, బీటా కెరోటిన్ కామెర్లు సమస్యలను మరింత పెంచుతాయి. ఇది కాకుండా గర్భిణీలు కూడా బొప్పాయి తినకూడదు. బొప్పాయి, అరటిపండు కలయిక గర్భిణీలకి సరైనది కాదు. జలుబు వచ్చినా అరటిపండు, బొప్పాయి తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Russia Ukraine War: ఉక్రెయిన్‌ దాడుల్లో అమెరికన్‌ జర్నలిస్ట్‌ మృతి.. మరొకరి తీవ్ర గాయాలు..

CBSE: పదో తరగతి విద్యార్థులకి షాక్.. అవి రిజల్ట్‌ కాదు.. థియరీ మార్కులు మాత్రమే..

Post Office Net Banking: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా.. ఇలా నెట్‌ బ్యాంకింగ్‌ యాక్టివేట్‌ చేసుకోండి..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!