Beauty Tips: వేసవిలో ఫేస్ గ్లో తగ్గకూడదనుకుంటే.. జస్ట్ ఈ చిట్కాలు పాటించండి అంతే..

Skin Care Tips: వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావం మన చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. కావున మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సంరక్షణ కోసం చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవి కాలంలో ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా తళతళలాడే అందం మీ సొంతం అవుతుంది. దీంతోపాటు చర్మ సమస్యలు తొలిగిపోతాయి.

Shaik Madar Saheb

|

Updated on: Mar 13, 2022 | 10:02 PM

ఫేస్ వాష్: ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్‌తో ముఖం శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. జిడ్డు చర్మం ఉన్నవారు ఆయిల్ ఫ్రీ క్లెన్సర్‌తో చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. చర్మాన్ని శుభ్రపరచడం వల్ల పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది.

1 / 6
స్క్రబ్బింగ్: వాతావరణంలో మార్పుల కారణంగా, గాలిలో ఉండే కణాలు చర్మంపై అలానే ఉండిపోతాయి. కొంతకాలం తర్వాత అవి మచ్చలు లేదా మొటిమలకు కారణం అవుతాయి. దీని కోసం చర్మాన్ని స్క్రబ్ చేయడం ఉత్తమం. స్క్రబ్బింగ్ చేయడం వల్ల ఫేస్ పూర్తి శుభ్రపడుతుంది.

2 / 6
ప్యాక్: స్కిన్ కేర్ రొటీన్లో భాగంగా వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవడం మంచిది. కావాలంటే పసుపు, క్రీమ్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి రాసుకుంటే చర్మం మెరిసిపోతుంది. పసుపు మొటిమలను తొలగిస్తుంది. ఈ సీజన్‌లో చర్మాన్ని తేమగా ఉంచడానికి ఈ క్రీమ్ బాగా పని చేస్తుంది.

3 / 6
ఆవిరి: పెరుగుతున్న కాలుష్యం ప్రభావం మన చర్మంపై తీవ్రంగా కనిపిస్తుంది. చర్మంపై పేరుకుపోయిన కాలుష్యాన్ని తొలగించడానికి మీరు ఆవిరి సహాయం తీసుకోవచ్చు. ఆవిరిని పట్టడం వల్ల స్వేదరంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో చర్మం బాగా మెరిసిపోతుంది.

4 / 6
మాయిశ్చరైజింగ్: ఎండాకాలంలో చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి మాయిశ్చరైజింగ్ క్రీములను అప్లై చేస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత అలా చేయడం మానేస్తుంటారు. వాతావరణం ఏదైనా సరే, చర్మంపై మాయిశ్చరైజర్ రాసుకోవడం మానేయకండి. పడుకునే ముందు కూడా క్రీమ్ అప్లై చేయడం మంచిది.

5 / 6
వేసవి కాలంలో ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా తళతళలాడే అందం మీ సొంతం అవుతుంది. దీంతోపాటు చర్మ సమస్యలు తొలిగిపోతాయి.

6 / 6
Follow us