Sabja Seeds: సబ్జా గింజలతో అదిరిపోయే ప్రయోజనాలు.. మధుమేహం ఉన్నవారికి..

Sabja Seeds: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతుంటాయి. సమ్మర్‌ (Summer)లో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. దీంతో బయటకు వెళ్లాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవడం..

Sabja Seeds: సబ్జా గింజలతో అదిరిపోయే ప్రయోజనాలు.. మధుమేహం ఉన్నవారికి..
Sabja Seeds
Follow us
Subhash Goud

|

Updated on: Mar 14, 2022 | 8:10 AM

Sabja Seeds: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతుంటాయి. సమ్మర్‌ (Summer)లో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. దీంతో బయటకు వెళ్లాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఒంట్లో వేడి పెరిగిపోతుంటుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక మన ఎన్నో రకాల పానియాలు తాగుతుంటాము. కానీ వేసవి నుంచి తట్టుకునేందుకు మంచి పానీయం ఉంది. అదే సబ్జా (Sabja) గింజల పానీయం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిని తాగేవారు. ఈ సబ్జాలు మన ఒంటికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడమే కాకుండా మన ఒంటికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్దకం, మధుమేహం, డీహైడ్రేషన్‌, శ్వాసకోశ వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి ఔషధంగా పని చేస్తాయి.

మలబద్దకానికి చెక్

సబ్జాలలలో అధికంగా పీజు ఉండటం వల్ల మలబద్దకం సమస్యను నివారిస్తుంది. రోజు పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే ప్రయోజనం ఉంటుంది. అలాగే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అయ్యేందుకు ఉపయోగపడతాయి. అలాగే కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి.

బరువు తగ్గడానికి..

ఊబకాయంతో ఇబ్బందులు పడేవారికి సబ్జా గింజలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆహారం తీసుకునే ముందు గ్లాసుడు సబ్జా గింజల పానీయం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

మధుమేహం ఉన్నవారికి..

సబ్జాలు మధుమేహం ఉన్నవారికి కూడా మంచి ఉపయోగంగా ఉంటుంది. సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జా గింజలు పిల్లలు కూడా తాగవచ్చు. వారు ఆరోగ్యంగా ఉంటారు. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు. సబ్జాలలో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం పుష్కంగా ఉంటుంది. మహిళలకు ఫోలేట్‌, నియాసిన్‌, విటమిన్‌ సి వంటి పోషకాలు అందుతాయి.

(గమనిక: ఇందులోని అంశాలన్నీ ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి)

ఇవి కూడా చదవండి:

Health Tips: వసంతకాలంలో ఈ ఆయుర్వేద చిట్కాలను అనుసరించండి.. అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం..

Colorectal Cancer: పురుషులకు ఎక్కువగా వచ్చే కాన్సర్ ఇదే.. జీవనశైలి మార్పుల కారణంగా ప్రమాదం ఎక్కువ