Health Tips: కిడ్నీలో రాళ్లుంటే ఈ పండ్లు అసలు తినకూడదు.. ఎందుకో తెలుసా?
Kidney Stone Hacks: సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, పోషకాహారలేమి, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు.
Kidney Stone Hacks: సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, పోషకాహారలేమి, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడడం వల్ల తీవ్రమైన ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల అది క్రమంగా లివర్ ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు పెద్ద పేగు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముందంటున్నారు. అయితే కిడ్నీలో రాళ్ల సైజును బట్టి సకాలంలో శస్త్రచికిత్స చేయడం ద్వారా వీటిని తొలగించవచ్చు. అయితే రాళ్ల సైజు చిన్నగా ఉంటే కొన్ని రకాల మందులు, ఆహార పదార్థాలతో వాటిని తొలగించుకోవచ్చు. కాగా కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే సమస్య మరిం తీవ్రతరమవుతుంది. ముఖ్యంగా ఏ పండ్లు తినాలి? ఏవి తినకూడదు? అనే విషయంపై అవగాహన కలిగి ఉండాలి.
ఏయే పండ్లను తినాలంటే.. *కిడ్నీలో రాళ్ల సమస్యను పరిష్కరించుకోవాలంటే హైడ్రెటెడ్‌గా ఉండడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పుచ్చకాయ, సీతాఫలం, కొబ్బరి నీళ్లను బాగా తీసుకోవాలి. అయితే పుచ్చకాయ గింజలను అసలు తీసుకోకూడదు.
* సిట్రస్ పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సి కిడ్నలో రాళ్లను కరిగిస్తుందని వైద్యులు చెబుతారు. అంతే కాదు వీటిలో ఉండే సిట్రిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే నారింజ, సీజనల్, జామ, ద్రాక్షలను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఈ పండ్లు కిడ్నీలో రాళ్ల సమస్యను దూరం చేయడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి.
* క్యాల్షియం కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అందుకే క్యా్ల్షియం పుష్కలంగా దొరికే కివీ, నల్ల ద్రాక్ష, అత్తి పండ్ల తదితర పండ్లను ఎక్కువగా తీసుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు.
ఈ పండ్లు అసలు తినవద్దు.. కిడ్నీలో రాళ్లు, ఇతర మూత్ర పిండాల సమస్యలున్నవారు దానిమ్మ, బత్తాయి, మామిడి, కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలి. వీటిని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. అంతేకాదు ఈ పండ్లు కిడ్నీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, ఫ్రైడ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
Also Read:Gautham Karthik: యంగ్ హీరోతో హీరోయిన ఎఫైర్.. దొరికిపోవడంతో రచ్చ
Samantha: సమంతను ఫాలో అవుతున్న రష్మిక… ఇంతకీ సంగతేంటంటే.!
Nagababu: నాగబాబు షాకింగ్ డిసిషన్… మరి చిరు, పవన్ ఓకే అంటారా..