Sapota Benefits: సపోటా తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Sapota health benefits: పండ్లు(Fruits) తినడం శరీరానికి ఎంతో మంచిది. ముఖ్యంగా సీజన్‌లో దొరికే పండ్లను తింటే ఇంకా మంచిది...

Sapota Benefits: సపోటా తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Sapota
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 14, 2022 | 5:58 PM

పండ్లు(Fruits) తినడం శరీరానికి ఎంతో మంచిది. ముఖ్యంగా సీజన్‌లో దొరికే పండ్లను తింటే ఇంకా మంచిది. చాలా రకాల పండ్లలో విటమిన్స్(Vitamins), పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి వాటి సపోటా(Sapota) ఒకటి సపోటా పండును ఎలా తిన్నా.. తాగినా లాభాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక సపోటా పండులో మనకు ఎన్నో రకాల పోషకాలు లభించడంతోపాటు ఆ పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. సపోటా పండులో ఫోలేట్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, మినరల్స్ , విటమిన్స్ వంటి పోషక పదార్థాలు ఉంటాయి. అంతేకాదు ఈ సపోటా పండు లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

ఇక సపోటాలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు శరీరంలోకి వైరస్ బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్లు చేరకుండా కాపాడుతాయి. సపోటా పండులో క్యాల్షియం ఉండటం వల్ల ఎముకలు, పళ్లు దృఢంగా మారడానికి సహాయపడుతాయి. ఇక ఇందులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఎవరైనా సరే చూపు మందగించిందని బాధపడేవారు క్రమం తప్పకుండా సపోటాలు తినడం వల్ల కంటి చూపు మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్, పీచుపదార్థాలు ఉండడంవల్ల క్యాన్సర్ కారక వైరస్‌ను నాశనం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. గర్భం ధరించిన స్త్రీలు, బాలింతలు కూడా సపోటా పండ్లు తినవచ్చునని వైద్యులు సలహా ఇస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు కూడా ప్రతి రోజూ రెండేసి చొప్పున సపోటా పండ్లు తినడం వల్ల వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Read Also.. Skin Diseases: చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే..