Colorectal Cancer: పురుషులకు ఎక్కువగా వచ్చే కాన్సర్ ఇదే.. జీవనశైలి మార్పుల కారణంగా ప్రమాదం ఎక్కువ
Colorectal Cancer: ప్రస్తుతం రకరకాల క్యాన్సర్ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం, నివసించే వాతావరణం, ఇతర కారణాల వల్ల క్యాన్సర్ సంభవిస్తుంది. పెద్ద..
Colorectal Cancer: ప్రస్తుతం రకరకాల క్యాన్సర్ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం, నివసించే వాతావరణం, ఇతర కారణాల వల్ల క్యాన్సర్ సంభవిస్తుంది. పెద్ద ప్రేగు క్యాన్సర్ (Cancer)గా పిలిచే ఈ క్యాన్సర్ జీర్ణవ్యవస్థ దిగువ భాగంలో ఉంటుంది. పెద్దప్రేగు క్యాన్సర్ (Colon Cancer) చాలా సందర్భాలలో అడెనోమాటస్ పాలిప్స్ అని పిలువబడే కణాల చిన్న, క్యాన్సర్ లేని సమూహాలుగా ప్రారంభమవుతాయి. మల క్యాన్సర్ అనేది పెద్దప్రేగుకు సంబంధించినది. ఈ రెండింటిని కలిపి కొలొరెక్టల్ క్యాన్సర్లుగా సూచిస్తారు వైద్యులు. కొలొరెక్టర్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా పురుషులలో సంభవించే సాధారణ క్యాన్సర్. ఇది సాధారణంగా పెద్ద ప్రేగు, పురుషనాళాన్ని ప్రభావితం చేస్తుంది. కొలొరెక్టల్ క్యాన్సర్ పురుషులు, మహిళలు ఇద్దరికి వస్తుందని, అవగాహన కల్పించడానికి మార్చిలో కొలొరెక్టల్ క్యాన్సర్ అవగాహన నెలగా పాటిస్తారు.
ఈ అలవాట్లు ఉంటే క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ..
న్యూఢిల్లీలోని ఉజాలా సిగ్నస్ గ్రూప్ ఆఫ్ ఆస్పత్రి వ్యవస్థాపక డైరెక్టర్ షుచిన్ బజాజ్ మాట్లాడుతూ.. కొలొరెక్టల్ క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు.. బరువు తగ్గడం, మలంలో రక్తం, కడుపు నొప్పి, మలబద్దక సమస్యలు వంటివి ఉంటాయని అన్నారు. ఆహారం, నీరు, వాయు కాలుష్యం వంటి పర్యావరణ కారకాలు 95 శాతం కొలొరెక్టల్ క్యాన్సర్‌లకు ప్రముఖ పాత్ర పోషిస్తాయని, జీవనశైలి, ఒత్తిడి, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యం, జంక్ ఫుడ్డు వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని పేర్కొన్నారు. కొలొరెక్టల్ క్యాన్సర్ గురించి అవగాహన పొందడం ఎంతో ముఖ్యమంటున్నారు. సమతుల్య పోషకాలు, ఆకు కూరలు సమృద్ధిగా ఇంట్లో వండి ఆహారం తీసుకోవాలంటున్నారు. మాంసాహార భోజనాన్ని ఎంచుకోవడం, ఫైబర్, పండ్లు, కూరగాయలు, ఫోలేట్, కాల్షియం, విటమిన్-డి అధికంగా ఉండే పదార్ధాలను తీసుకుంటే పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని వివరిస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, రోజువారీ వ్యాయామం చేయడం వల్ల బరువు అదుపులో ఉంటుందని, దీని ద్వారా ఈ క్యాన్సర్ బారి నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. శుభ్రమైన టాయిలెట్స్‌ను వాడటం ఎంతే ముఖ్యమంటున్నారు షుచిన్ బజాజ్. శుభ్రమైన టాయిలెట్స్ వాడాలని, దీని కారణంగా వ్యాధులు దరి చేరుతాయంటున్నారు.
ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ నుంచి గట్టెక్కవచ్చు..
అన్ని క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించడం ఎంతో ముఖ్యమంటున్నారు. క్యాన్సర్ మొదటి దశలో ఉండగానే చికిత్స పొందితే వారికి కీమో లేదా రేడియేషన్ థెరఫి అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు 45 సంవత్సరాల వయసు నుంచి సాధారణంగా పరీక్షలు నిర్వహించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. క్యాన్సర్ కణితి దాని ప్రారంభ దశలో స్కానింగ్ ద్వారా గుర్తించవచ్చని, దీంతో క్యాన్సర్ ప్రమాదం నుంచి త్వరగా బయటపడవచ్చంటున్నారు డాక్టర్ బజాజ్.
స్త్రీలకు కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం..
50 ఏళ్లలోపు గర్భాశయం లేదా అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న స్త్రీలకు కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాన్సర్ 93 శాతం కేసులు 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులలో సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొలొరెక్టల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏమిటి ?
పెద్దప్రేగు లేదా పురుషనాళంలో క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని బట్టి కొలొరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు మారుతూ ఉంటాయి. కొలొరెక్టల్ క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణం మల రక్తస్రావం. పెద్దప్రేగు ఎడమ వైపు నుండి ఉత్పన్నమయ్యే క్యాన్సర్లు సాధారణంగా రక్తస్రావం కలిగిస్తాయి. లేదా చివరి దశలో మలబద్ధకం, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.
మహిళల కంటే పురుషుల్లో సంభవం ఎక్కువ..
అయితే కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదంలో పురుషులు, మహిళలు ఇద్దరూ సమానంగా ఉంటారు. 50 ఏళ్లు పైబడిన పురుషులు, 55 ఏళ్లు పైబడిన మహిళలు పెద్దప్రేగు కాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు వార్షిక ప్రాతిపదికన ఈ పరీక్ష చేయించుకోవాలి. ఇంకా కొలొరెక్టల్ క్యాన్సర్ అనేది రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ తర్వాత మహిళల్లో మూడవ అత్యంత సాధారణ ప్రాణాంతకత. మహిళల కంటే పురుషులలో సంభవం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
(గమనిక: ఇందులోని అంశాలన్ని వైద్య నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి: