AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kashmir Files: సినిమా చూసేందుకు రాష్ట్ర పోలీసులందరికీ ఒకరోజు సెలవు.. ఎక్కడంటే..

ఇప్పుడు దేశమంతా సినిమా ప్రియులు మాట్లాడుకుంటున్న చిత్రం ది కశ్మర్‌ ఫైల్స్‌ (The Kashmir Files). 1990 నాటి జమ్మూకశ్మీర్‌ పండిట్ల ఉచకోతలు, వలసల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihothri) ఈ సినిమాను తెరకెక్కించారు

The Kashmir Files: సినిమా చూసేందుకు రాష్ట్ర పోలీసులందరికీ ఒకరోజు సెలవు.. ఎక్కడంటే..
The Kashmir Files
Basha Shek
|

Updated on: Mar 16, 2022 | 6:39 AM

Share

ఇప్పుడు దేశమంతా సినిమా ప్రియులు మాట్లాడుకుంటున్న చిత్రం ది కశ్మీర్ ఫైల్స్‌ (The Kashmir Files). 1990 నాటి జమ్మూకశ్మీర్‌ పండిట్ల ఉచకోతలు, వలసల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihothri) ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదల సమయంలో అతి తక్కువ థియేటర్లలో స్క్రీనింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆ తర్వాత పబ్లిక్ డిమాండ్ మేరకు అన్ని చోట్లా అదనపు షోలు వేసుకుంటూ పోతోంది. సోషల్‌ మీడియాలోనూ ఈ సినిమా హాట్‌ టాపిక్‌గా మారింది. గుజరాత్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ది కశ్మర్‌ ఫైల్స్‌ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడం రాజకీయ చర్చకు దారితీసింది. ఇక జమ్ములోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ సినిమా ప్రదర్శనను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. వాస్తవాలను వక్రీకరించి చూపించారని కశ్మీర్‌ ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం (Madhya Pradesh Govt) ఇప్పటికే ది కశ్మీర్ ఫైల్స్ కు ట్యాక్స్‌ మినహాయింపు ప్రకటించగా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. పోలీసులు, వారి కుటుంబాలతో సహా ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా చూసేందుకు రాష్ట్రంలోని పోలీసులందరికీ ఒక రోజు సెలవు ప్రకటించింది. అదికూడా ఏ పోలీసు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు, ఒక రోజు లీవ్ తీసుకుని.. మూవీకి వెళ్లవచ్చట.ఈమేరకు మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా నేరుగా రాష్ట్ర డీజీపీనే ఆదేశించారట.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే..

ఈక్రమంలో పోలీసులు తమతమ కుటుంబాలతో ది కశ్మర్‌ ఫైల్స్‌ సినిమాకు వెళ్లేందుకు సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వలు జారీ అయ్యాయి. కాగా దేశంలోని పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి ట్యాక్స్ రాయితీ లభిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ సినిమా దర్శక నిర్మాతల్ని పిలిపించి మరీ ప్రత్యేకంగా అభినందించారు. కాగా మొదట్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేనప్పటికీ ఆతర్వాత పాజిటివ్ టాక్‌తో ద కశ్మీర్ ఫైల్స్ దూసుకుపోతోంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఉత్తరాదిలో అయితే ఈ సినిమా కోసం థియేటర్లు పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మించారు.

Also Read: Vijayawada: ఇంద్రకీలాద్రిపై పెరుగుతున్న భక్తుల రద్దీ.. దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాదిగా వస్తున్న భక్తులు..

Elephants: పండ్లు, కూరగాయలతో ఏనుగులకు భారీ విందు.. ఎక్కడో తెలుసా..?

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు