Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై పెరుగుతున్న భక్తుల రద్దీ.. దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాదిగా వస్తున్న భక్తులు..

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఇంద్రకీలాద్రికి భక్తుల రాక పెరిగింది.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై పెరుగుతున్న భక్తుల రద్దీ.. దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాదిగా వస్తున్న భక్తులు..
Durga Temple
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 15, 2022 | 6:44 AM

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఇంద్రకీలాద్రికి భక్తుల రాక పెరిగింది. సాధారణ రోజుల్లో 20 నుంచి 30వేల మంది భక్తులు దర్శనానికి వస్తుండగా వారంతాలు, సెలవు రోజుల్లో 30 నుంచి 50వేల మందికి పైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం కుదించిన దర్శన వేళలను అధికారులు ఇటీవల యథావిధిగా మార్చిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకు దర్శనాలకు అనుమతిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మొదలైన భక్తుల రద్దీ రాత్రి వరకు కొనసాగింది. ఉదయం 10 గంటల నుంచి అటు ఘాట్‌ రోడ్డు వైపు, ఇటు కనకదుర్గా నగర్‌ వైపు నుంచి భక్తులు తండోపతండాలుగా రావడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. నివేదన సందర్భంగా ఉదయం 11.30 నుంచి 12.15 గంటల వరకు దర్శనాలు నిలిపేయడంతో రద్దీ ఎక్కువై భక్తులు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ వేడికి అల్లాడిపోయారు. గంటల తరబడి నిలబడి ఉన్న భక్తులకు ఓపిక నశించి ఎక్కడివారక్కడ కింద కూర్చుండిపోయారు. క్యూలైన్లు నిండి పోవటంతో వేలసంఖ్యలో భక్తులు ఆలయ పరిసరాల్లో ఉండాల్సి వచ్చింది. దర్శనాలను పునరుద్ధరించాక భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు రావడంతో భక్తులను నియంత్రించడం సిబ్బందికి కష్టతరంగా మారింది. ఈవో భ్రమరాంబ అంతరాలయం వద్ద కూర్చుని వీఐపీ దర్శనాలను నియంత్రించి సాధారణ భక్తులు, రూ.100, రూ. 300 క్యూలైన్లలో వచ్చిన భక్తుల దర్శనాలను వేగవంతం చేయడంతో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో క్యూలైన్లు సాధారణ స్థితికి చేరుకున్నాయి. అన్నప్రసాదానికి వెళ్లిన భక్తులతో మహామండపంలోని మూడు, రెండో అంతస్తులు, తలనీలాలు సమర్పించే భక్తులతో కేశఖండనశాల, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం, ప్రసాదాల కౌంటర్లు, ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి.

Also read:

Sandhya Raju: ఆకట్టుకుంటున్న నాట్యం హీరోయిన్ ఫినామిల్ ఉమెన్ వీడియో.. ప్రశంసలు కురిపించిన ఎఆర్ రెహమాన్..

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

DSCR: ఏదైనా కంపెనీ బలం తెలుసుకోవాలంటే.. ఈ రేషియోను తప్పక చూడండి..