Chanakya Niti: కుటుంబ పెద్దలు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు.. అవేంటంటే..
Chanakya Niti: భారత సమాజం పితృసామ్య వ్యవస్థగా నడుస్తోంది. ఒక కుటుంబం బాగుండాలంటే.. ఆ కుటుంబాన్ని నడిపే పెద్ద సరిగా ఉండాలి.
Chanakya Niti: భారత సమాజం పితృసామ్య వ్యవస్థగా నడుస్తోంది. ఒక కుటుంబం బాగుండాలంటే.. ఆ కుటుంబాన్ని నడిపే పెద్ద సరిగా ఉండాలి. వారి ఆచరణలు, విధానాలు కుటుంబం మొత్తం ప్రభావం చూపుతాయి. అందుకే ఆచార్య చాణక్యుడు ఇంటి పెద్దలు ఎలా ఉండాలనే దానిపై కీలక సహాలు, సూచనలు చేశారు. ముఖ్యంగా ఇంటి పెద్ద ఎల్లప్పుడూ ఉత్తమ సంబంధాలను కొనసాగించాలని సూచిస్తుంటారు. సోదరీ, సోదరులతో, బంధు మిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచిస్తున్నారు. మంచి సంబంధాలు నెరపడం ద్వారా ఇంటి మొత్తాన్ని పద్ధతిగా నడపగలరి చాణక్యుడి విశ్వాసం. మరికొన్ని సూచనలు కూడా చేశారు చాణక్య. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆహారాన్ని అగౌరవపరచవద్దు: ఇంటి పెద్దలు ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేయకూడదు. ఎంత అవసరమో అంతే పెట్టుకుని తినాలి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు పెద్దలను చూసే నేర్చుకుంటారు. మీరు ఇలా చేయడం పిల్లలు చూస్తే రేపటి రోజున పిల్లలు కూడా అలాగే చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో దారిద్య్రం పెరుగుతుంది. ఇంటి సంతోషం, శ్రేయస్సు కోసం ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయవద్దు.
చర్చ: ఇంటి పెద్ద అందరితోనూ సరదాగా మాట్లాడాలి. ఇది సంబంధాలను మెరుగుపరచడమే కాకుండా, అనేక సమస్యలను కూడా పరిష్కరించడానికి అవకాశం కల్పిస్తుంది. అందుకే అందరి మాట వినడం, చర్చించుకోవడం అధినేత కర్తవ్యం.
వృధా ఖర్చులకు దూరంగా ఉండండి: ఇంటి పెద్దలు కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ముందుకు సాగాలి. కొన్నిసార్లు వృధా ఖర్చులు రాబోయే సమస్యలకు ఇబ్బందిని కలిగిస్తాయి. కాబట్టి కష్ట సమయాల్లో డబ్బు ఆదా చేసుకోండి. జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అలాగే ఇంటి పెద్దలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాలి. ఎప్పుడూ ముఖ్యమైన నిర్ణయాలను తొందరపాటుతో తీసుకోకండి. ఇది కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు హానికరం. కాబట్టి ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి.
Also read:
Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
DSCR: ఏదైనా కంపెనీ బలం తెలుసుకోవాలంటే.. ఈ రేషియోను తప్పక చూడండి..