Horoscope Today: వీరికి ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి.. అవకాశాలు ఎక్కువే.. మంగళవారం రాశి ఫలాలు..
ఈరోజు మంగళవారం.. ఫాల్గుణ మాసం.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మ రాశి ప్రకారం వారి స్వభావం ఆధారపడి ఉంటుంది. అలాగే.. వారి రాశి చక్రం
ఈరోజు మంగళవారం.. ఫాల్గుణ మాసం.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మ రాశి ప్రకారం వారి స్వభావం ఆధారపడి ఉంటుంది. అలాగే.. వారి రాశి చక్రం బట్టి రోజులో ఎలాంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి అనేది ముందుగానే అవగాహన వస్తుంది. అందుకే రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మంగళవారం రాశి ఫలాలు.
మేష రాశి.. వీరు ఎక్కువగా ఖర్చులు చేస్తారు… మానసిక ఆందోళన పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు.. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ప్రతి విషయంలో జాగ్రత్తలు అవసరం.. కొత్తవారితో పరిచయం విషయంలో అచితూచి ప్రవర్తించాలి.
వృషభ రాశి.. వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయాణాలు అధికంగా ఉంటారు. కుటుంబసభ్యులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. ఖర్చులు అధికమవుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి.. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మిథున రాశి.. వీరు బంధుమిత్రులను కలుసుకుంటారు. విదేశయాన ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులు తగ్గుతాయి. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు.
కర్కాటక రాశి.. నూతన పనులు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేధాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మానసిక ఆందోళన పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
సింహ రాశి.. మానసిక ఆందోళన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో విరోధాలు తగ్గుతాయి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఉద్యోగాలు.. వ్యాపారంలో మార్పులు జరుగుతాయి.
కన్య రాశి.. వీరికి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. కొత్తవారితో పరిచయం అవుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సరైన నిర్ణయాలు అవసరం.
తుల రాశి.. ఉద్యోగంలో స్థానచలనం ఉంటుంది. కొత్తవారితో పరిచయం జరుగుతుంది. మానసిక ఆందోళన పెరుగుతాయి. ఇంట్లో మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
వృశ్చిక రాశి.. వీరు దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సంఘంలో మాట్లాడేప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలి..
ధనుస్సు రాశి.. మీడియా రంగంలో ఉండేవారికి మంచి అవకాశాలు వస్తాయి. అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం.. వ్యాపారంలో మార్పులు వస్తాయి.
మకర రాశి.. ఈరోజు వీరికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు తగ్గిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు తగ్గుతాయి. సన్నిహితుల మద్దతు లభిస్తుంది. రాజకీయ రంగాల్లో ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు సంతోషంగా ఉంటారు.
కుంభరాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు . స్థిర నిర్ణయాలు తీసుకోలేరు. వివాదాల్లో చిక్కుకుంటారు.. సంఘంలో గౌరవ, మర్యాదలు తగ్గుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
మీన రాశి.. వీరు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి.
Also Read: Jayamma Panchayathi: సుమ కనకాల పంచాయతీ పెట్టేది ఆ రోజునేనంట.. రిలీజ్ డేట్ ఫిక్స్
Kiran Abbavaram: జోరు పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా మొదలు పెట్టేసిన కిరణ్ అబ్బవరం..
RRR Movie: అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ టీఎమ్.. ఎత్తర జెండా ఫుల్ సాంగ్ వచ్చేసింది..
Aamir Khan: మాజీ భార్యలతో బంధంపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు