Chanakya Niti: లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సొంతం కావాలంటే.. ఈ 4 విషయాలు పాటించమంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) మనిషి జీవిత విధానానికి సంబంధించిన అనేక విషయాలను గురించి నీతి శాస్త్రంలో చెప్పాడు. ముఖ్యంగా డబ్బును ఖర్చు పెట్టె విధానం గురించి తన నీతి శాస్త్రం(Niti Shastra)లో ..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) మనిషి జీవిత విధానానికి సంబంధించిన అనేక విషయాలను గురించి నీతి శాస్త్రంలో చెప్పాడు. ముఖ్యంగా డబ్బును ఖర్చు పెట్టె విధానం గురించి తన నీతి శాస్త్రం(Niti Shastra)లో చాణుక్యుడు వివరించాడు. అదే సమయంలో డబ్బును సంపాదించడానికి ఖర్చు చేయడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయని లక్ష్మీదేవి ఎప్పుడూ మీ సొంతం కావాలంటే.. కొన్ని విషయాలను పాటించాలని సూచించాడు. మీరు కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడకూడదని కోరుకుంటే.. డబ్బుకు సంబంధించిన ఆచార్య చెప్పిన ఈ విధానాన్ని గుర్తుంచుకోవాల్సిందేనని పెద్దలు చెబుతుంటారు. ఈరోజు చాణుక్యుడు చెప్పిన విషయాలను గురించి తెలుసుకుందాం..
- ఆహారాన్ని వృధా చేయవద్దు – ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. మనం ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేయకూడదు. దీంతో లక్ష్మికి కోపం వస్తుంది.. ఎందుకంటే అన్నపూర్ణ దేవి లక్ష్మీ దేవి రూపం.. కనుక తినే ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకండి. అవసరమైనంత మాత్రమే తీసుకోండి
- పేదవారికి సహాయం చేయండి – ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఎల్లప్పుడూ అవసరమైన వ్యక్తికి సహాయం చేయండి. దీనితో మా లక్ష్మి ప్రసన్నురాలవుతుంది. లక్ష్మిదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కనుక ఆపన్నులకు, పేదవారికి సహాయం చేయండి
- కలిసి జీవించండి – ఎల్లప్పుడూ కలహాలు ఉన్న వాతావరణం ఉండే ఇంట్లో పేదరికం తాండవిస్తుంది. ఇంట్లోని వ్యక్తుల కలిసి మెలసి సంతోషంగా జీవిస్తే.. గొడవలు, పరస్పర విబేధాలు ఉండవు..అటువంటి ఇంట్లో లక్ష్మీనివాసం ఉంటుంది.
- వృధా ఖర్చు చేయవద్దు – ఎల్లప్పుడూ అవసరాన్ని బట్టి డబ్బు ఖర్చు చేయండి. చాలా మంది అనవసరంగా ఖర్చు చేస్తుంటారు. ఇలా వృధాగా ఖర్చు చేస్తుంటే లక్ష్మిదేవికి కోపం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్‌ను తయారు చేసుకుని అవసరాన్ని బట్టి డబ్బు ఖర్చు చేసుకోవాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మేలు.
- దొంగతనం చేయవద్దు – ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, కష్టపడి డబ్బు సంపాదించే వ్యక్తుల దగ్గర ఎప్పుడూ లక్ష్మి దేవి ఉంటుంది. అయితే దొంగతనాలు పాల్పడే వారి దగ్గర, అబద్దాలు చెప్పేవారు దగ్గర లక్ష్మిదేవి ఎక్కువ కాలం ఉండదు.
Also Read:
Big News Big Debate: పొత్తుల పై జనసేనాని క్లారిటీ.. వైసీపీ ప్రభుత్వం పై ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్..