Onions Side Effects: నిత్యం ఉల్లి లేనిదే ముద్ద దిగడం లేదా.. అయితే ఈ సమస్యలున్నవారు తింటే కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్లే

Onions Side Effects: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెతను తరచుగా వింటూనే ఉన్నాం.. ఉల్లిపాయలు లేని రోజు కూర కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లి పాయ వెనక దాదాపు..

Onions Side Effects: నిత్యం ఉల్లి లేనిదే ముద్ద దిగడం లేదా.. అయితే ఈ సమస్యలున్నవారు తింటే కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్లే
Onions Side Effects
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2022 | 9:10 PM

Onions Side Effects: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెతను తరచుగా వింటూనే ఉన్నాం.. ఉల్లిపాయలు లేని రోజు కూర కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు(Medicine Values) ఉన్నాయి. వైద్య పరంగా ఉల్లిపాయతో అనేక ప్రయోజనాలున్నాయి. కొందరు ఈ ఉల్లిపాయలను పచ్చిగానే తింటారు కూడా.. అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఇచ్చే ఈ ఉల్లిపాయను కూడా కొంతమంది .. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నారు దూరంగా ఉండడం మంచిది అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఈరోజు ఎవరెవరు ఉల్లిపాయలను తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఎవరైనా హైపో గ్లైసీమియా(షుగర్ లెవల్స్ తక్కువ) సమస్యతో ఇబ్బంది పడేవారు ఉల్లిపాయను తినడకూడదు. ఉల్లిపాయ షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. దీంతో హైపో గ్లైసీమియా ఉన్నవారు ఉల్లిపాయ తింటే.. ఇంకా తక్కువకి షుగర్ లెవెల్స్ చేరుకొని ఇబ్బంది పడే అవకాశం ఉంది.
  2. శరీరంలో కె విటమిన్ అధికంగా ఉన్నవారు ఉల్లిపాయను తక్కువ తీసుకోవాలి. ఎందులకంటే ఉల్లిలో విటమిన్ కే అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ రక్తాన్ని గడ్డ కట్టెలా చేస్తుంది. కనుక శరీరం లోపల రక్తం గడ్డ కట్టే సమస్య ఉన్నవారు ఉల్లిపాయను దూరంగా పెట్టాలి. లేదంటే హార్ట్ ఎటాక్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది.
  3. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నవారు ఉల్లిపాయను పక్కకు పెట్టడం.. లేదా తక్కువ మొత్తంలో తీసుకోవడం ఉత్తమం.. దీనిలో ఫ్ర‌క్టోజ్ అధికంగా ఉండడంతో గ్యాస్ ట్ర‌బుల్ సమస్యలు వస్తాయి.
  4. హృదయ సంబంధం సమస్యలతో ఉన్నవారు కూడా ఉల్లిపాయలకు దూరంగా ఉండడం మంచిది. లేదా మొత్తానికి ఉల్లిపాయను తినడం మానేయడం కూడా మేలు చేస్తుంది. ఎందులకంటే ఉల్లిపాయలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది.
  5. ముఖ్యంగా గర్భణీలు  కట్ చేసి నిల్వ ఉంచిన  ఉల్లిపాయ‌ల‌ను అస్స‌లు తినకూడదు. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయను తింటే క‌డుపు ఉబ్బ‌రం, గుండెల్లో మంట వంటి స‌మ‌స్య‌లు వచ్చే అవకాశం ఉంది.

Also Read:

Andhra Pradesh: నేటికీ ప్రారంభంకాని గోదావరి తీరంలో భవనాలు, వంతెనలు.. అసాంఘిక కార్యకలాపాకు అడ్డాగా

Watch Video: బంతి విసరకముందే నాన్‌స్ట్రైకర్‌ అత్యుత్సాహం.. ఇంత తొందరైతే ఎలా బ్రో అంటోన్న నెటిజన్లు.. వైరల్‌ వీడియో

RRR Movie : రాజమౌళి వచ్చినా రేటు మారదు.. మాకు అంతా ఒక్కటే : పేర్ని నాని