Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut water: కొబ్బరి నీళ్లు కాదు.. అమృత వర్షిణి అనడం బెటరేమో.. సమ్మర్ లో సాలిడ్ బెనిఫిట్స్ గురూ..!

కొబ్బరి బోండాం నీళ్లు ఎంతో శ్రేష్ఠమైనవి. ఎలాంటి రసాయనాలు లేకుండా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక్క కొబ్బరి బోండాం తాగితే పొట్టలో ఎంత హాయిగా ఉంటుందో మరి.

Coconut water: కొబ్బరి నీళ్లు కాదు.. అమృత వర్షిణి అనడం బెటరేమో.. సమ్మర్ లో సాలిడ్ బెనిఫిట్స్ గురూ..!
Coconut Water
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 14, 2022 | 8:21 PM

Health benefits of coconut water:  సమ్మర్ వచ్చేసింది.. హీట్ పెరిగిపోతుంది.. దీంతో ఎక్కువమంది డేంజర్ అని తెలిసినా కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. అదే పనిగా శీతల పానియాలు సేవిస్తూ ఉంటారు. ఇవి ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు కొబ్బరి బోండాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ కూల్ డ్రింక్స్ ఎందుకు తాగుతారో అర్థం కాని విషయం. మీకు తెలియదేమో… అందుకే కొబ్బరి నీళ్ల ప్రాముఖ్యతను మరోసారి వివరించబోతున్నాం. కొబ్బరి నీళ్ల టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి రసాయనాలు లేకుండా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇటు ఆరోగ్యం అందించడంతోపాటు ఎలాంటి దుష్ప్రభాలు కలిగించని ఏకైక పానీయం కొబ్బరి నీళ్లు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, ఎంజైమ్‌లు, బి-కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీటిలో 94% నీరు.. చాలా తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది. అలాగే, ఇందులో ఉండే సైటోకినిన్స్ వృద్ధాప్య సంకేతాలు రాకుండా నిరోధిస్తాయి. మీ డైట్‌లో కొబ్బరి నీళ్లను భాగం చేసుకుంటే శారీరకంగా ఎంతో దృఢంగా, నాజూకుగా తయారు కావచ్చని నిపుణులు అంటున్నారు.

  1. కొబ్బరి నీళ్లలో ఉన్న మాంగనీస్ కొవ్వు మెటబాలిజమ్‌, ఎంజైమ్‌ పనితీరు సరిగ్గా ఉండేటట్లు చేస్తుంది.
  2. కొబ్బరి నీరు అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.          
  3. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి అతిగా తినడం మానేస్తాం
  4. ప్రతి ఉదయం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యమవుతాయి. ఇది ఊబకాయం సమస్యను తొలగిస్తుంది.
  5. ఇందులో ఉండే ఫైబర్‌ బరువు తగ్గేందుకు సాయమవుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిని కొబ్బరి నీళ్లలోని పోషకాలు అదుపులో ఉంచుతాయి.
  6. కొబ్బరి నీళ్లలో మంచి మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది. కాబట్టి, దీనిని రోజూ తాగడం వల్ల జుట్టు బలోపేతం అవుతుంది. ఇది జుట్టు రాలడాన్ని కూడా ఆపుతుంది. అలాగే, చర్మం పొడిబారడం కూడా తొలగిపోతుంది.
  7. గుండె జబ్బులకు కారణమైన బెల్లీ ఫ్యాట్‌ తగ్గాలంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనె వాడటం మేలని నిపుణులు సూచిస్తున్నారు
  8. తాజా కొబ్బరి నీళ్లను తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  9. శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి సరిగ్గా కావాలంటే కొబ్బరినీళ్లలోని అమినో యాసిడ్‌ తోడ్పాటు ఇస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read: Telangana: చేతబడి చేసిన కోడిగుడ్లు గుటుక్కున మింగేసిన పోలీస్.. ఆపై అక్కడి కొబ్బరి నీళ్లతో దాహం తీర్చుకున్నాడు

‘మత్స్యకన్య’ ! కోతి-చేప కలయికే కారణమా..? మతి పోగొట్టే విషయాలు !