Hyderabad: హలీమ్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. మూడు వారాలకు ముందే సరికొత్త టెస్ట్‌తో వచ్చేసిందోచ్..

Hyderabad: రంజాన్(Ramadan) పండగ వస్తుందంటే చాలు.. అందరి మదిలోను ముందుగా మెదిలేది.. హలీమ్. ప్రపంచ వ్యాప్తంగా హలీమ్(Haleem)కు ప్రేమికులున్నారు. దీంతో హలీం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ప్రముఖ బిర్యానీ..

Hyderabad: హలీమ్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. మూడు వారాలకు ముందే సరికొత్త టెస్ట్‌తో వచ్చేసిందోచ్..
Paradise Haleem
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2022 | 6:18 PM

Hyderabad: రంజాన్(Ramadan) పండగ వస్తుందంటే చాలు.. అందరి మదిలోను ముందుగా మెదిలేది.. హలీమ్. ప్రపంచ వ్యాప్తంగా హలీమ్(Haleem)కు ప్రేమికులున్నారు. దీంతో హలీం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ప్రముఖ బిర్యానీ హౌస్‌ ప్యారడైజ్‌( Paradise). ఈ ఏడాది హలీమ్ ను మూడు వారాల ముందుగానే రెడీ చేస్తుంది. దీంతో హలీమ్‌ రుచులను మరిన్ని రోజులు ఆస్వాదించ వచ్చు.  ప్యారడైజ్‌ హలీమ్‌ వినూత్నత, ఆధీకృత హైదరాబాదీ హలీమ్‌ రెసిపీను అనుసరిస్తుంది. కోల్‌కతా రసగోలాకు జీఐ ట్యాగ్‌ లభించినట్లే హైదరాబాదీ హలీమ్‌కు కూడా జీఐ ట్యాగ్‌ లభించింది. ఈ ట్యాగ్‌ హైదరాబాదీలు ఎందుకు హలీమ్‌ రుచి, నాణ్యత పట్ల అమితాసక్తి కనబరుస్తున్నారన్నది వెల్లడిస్తుంది.

అయితే ఈ ఏడాది సుదీర్ఘకాలం పాటు హలీమ్‌ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ప్యారడైజ్‌ ఇప్పుడు హలీమ్‌ ఫెస్టివల్‌ ‘జష్న్‌–ఈ–హలీమ్‌’ను రేపటి నుంచి మే 5వ తేదీ 2022 వరకూ హైదరాబాద్‌లోని తమ 24 ప్యారడైజ్‌ ఔట్‌లెట్ల వ్యాప్తంగా తీసుకురాబోతుంది. తద్వారా హలీమ్‌ ప్రేమికులకు మరిన్ని రోజుల పాటు సంతోషం ఆస్వాదించే అవకాశం అందిస్తుంది. ప్యారడైజ్‌ హలీమ్‌ 100% స్వచ్ఛమైన హలాల్‌ మటన్‌, 100% స్వచ్ఛమైన నెయ్యి కలిగి ఉండటంతో పాటుగా ఆర్టిఫిషీయల్‌ ఫ్లేవర్స్‌, ఎలాంటి నిల్వకారకాలు కలిగి ఉండవు. దీనిలో అపరిమిత ప్రేమ మాత్రం ఉంటుంది.

ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో గౌతమ్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘ హలీమ్‌ ఫెస్టివల్‌ జష్న్‌–ఈ –హలీమ్‌ ప్రారంభించడం ద్వారా కేవలం హైదరాబాద్‌ నగర మహోన్నత సాంస్కృతిక వారసత్వం ప్రదర్శించడం మాత్రమే కాదు హైదరాబాదీ హలీమ్‌తో ఉన్న బంధాన్నీ ప్రతిధ్వనిస్తుంది. ఈ సంవత్సరం ప్యారడైజ్‌ తమ ఆహారంలో వినూత్నమైన మసాలాలను తమ అభిమాన వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా జోడించింది. ప్యారడైజ్‌ హలీమ్‌లో 30కు పైగా నాణ్యమైన ఇంగ్రీడియెంట్స్‌ను వినియోగించాము. వీటిని అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేయడంతో పాటుగా ఖచ్చితమైన పోర్షన్స్‌లో జోడించాము. వీటిని అతి సున్నితమైన మంటపై వండటం వల్ల సువాసనలు నిలపబడ్డాయి. తద్వారా ప్యారడైజ్‌ హలీమ్‌ హైదరాబాద్‌ నగరంలో ఎక్కువ మంది అభిమానించే హలీమ్‌గా నిలుస్తుంది’’ అని అన్నారు.

సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలలో భాగంగా, ప్యారడైజ్‌ తమ రుచికరమైన హలీమ్‌ను అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలకు అందించడం ద్వారా వేడుకలలో వారిని సైతం భాగం చేస్తుంది. ఈ విధంగా, హైదరాబాద్‌కు చెందిన వారసత్వ ఫుడ్‌ బ్రాండ్‌ తమ పండుగ సంబరాలను బీద వర్గాల ప్రజలకు అందించడంతో పాటుగా మరింతగా సంతోషాలనూ అందిస్తుంది.

ప్యారడైజ్‌ ఇప్పడు ట్యాంపర్‌ చేయలేనటువంటి ఫుడ్‌ ప్యాక్‌లను అందిస్తుంది. ఇవి అత్యుత్తమ పరిశుభ్రతను,  నాణ్యతను ఆఖరకు హోమ్‌ డెలివరీ సమయంలో కూడా అందిస్తామనే భరోసా అందిస్తుంది. అత్యున్నత నాణ్యత కలిగిన హలీమ్‌తో మూడు వారాల ముందుగానే హలీమ్‌ను తీసుకువస్తోన్న ప్యారడైజ్‌, తమ హలీమ్‌ అభిమానులకు ఆనందాన్ని అందిస్తూనే, హైదరాబాదీ గౌరవాన్ని జష్న్‌–ఈ–హలీమ్‌ ద్వారా భారతదేశమంతగా తీసుకువెళ్తున్నారు.

Paradises Jashn E Haleem

Paradises Jashn E Haleem

జష్న్‌–ఈ–హలీమ్‌ ప్రారంభం సందర్భంగా ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో శ్రీ గౌతమ్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘ ఏడు దశాబ్దాలైనప్పటికీ, మేము హైదరాబాద్‌తో పాటుగా భారతదేశమంతటా ప్రజలకు సరికొత్త రుచులను అందిస్తూనే ఉన్నాము. మా అద్భుతమైన నాయకత్వ , అంకితభావం కలిగిన బృందానికి ధన్యవాదములు చెప్పారు.

ప్యారడైజ్‌ హలీమ్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఇది మన సంస్కృతిలో అంతర్భాగంగా మారడం తో పాటుగా ఆధీకృత క్యుసిన్‌కు ఆవల ప్రజలను ఏకం చేస్తుంది. వినియోగదారుల అభిప్రాయాలకు అనుగుణంగా మేము ఈసారి ప్రత్యేకంగా మసాలాలను హలీమ్‌ తయారీలో వినియోగించనున్నామని చెప్పారు.

నాణ్యత, భద్రతకు ప్యారడైజ్‌ హామీనిస్తుంది. ప్యారడైజ్‌ పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలకు ఇవి కట్టుబడి ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత సమయానికి అవసరమైన రీతిలో ఇవి ఉంటాయి. ఆహారాన్ని అతి జాగ్రత్తగా, టేబుల్‌ వద్దకు సర్వ్‌ చేసేవరకూ పరిశుభ్రతా మార్గదర్శకాలకు కట్టుబడుతూ తయారుచేస్తున్నారు

ఈ ఆహార గొలుసుకట్టు సంస్థ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్‌ చేసిన రెస్టారెంట్‌ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్‌ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ లో అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా  గోల్డెన్‌ స్పూన్‌ అవార్డు ను ఇండియా ఫుడ్‌ ఫోరమ్‌ వద్ద 2018లో అందుకుంది. తెలంగాణా స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్స్‌, జీహెచ్‌ఎంసీ, టైమ్స్‌ ఫుడ్‌ అవార్డ్‌, ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణా, లైఫ్‌టైమ్‌ అావ్‌మెంట్‌ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది.

Also Read:

హోలీ రోజున ఈ వాస్తు పద్ధతలు పాటిస్తే ఏళ్లుగా పట్టిపీడిస్తున్న ఆర్థిక సమస్యలు దూరమవుతాయట..!

పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన