Holi 2022: హోలీ రోజున ఈ వాస్తు పద్ధతలు పాటిస్తే ఏళ్లుగా పట్టిపీడిస్తున్న ఆర్థిక సమస్యలు దూరమవుతాయట..!

Holi 2022: దేశంలో హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో హోలీ పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా..

Holi 2022: హోలీ రోజున ఈ వాస్తు పద్ధతలు పాటిస్తే ఏళ్లుగా పట్టిపీడిస్తున్న ఆర్థిక సమస్యలు దూరమవుతాయట..!
Holi
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 14, 2022 | 6:01 PM

Holi 2022: దేశంలో హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో హోలీ పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా యావత్ భారత సమాజం జరుపుకుంటుంది. ఈ పండుగను ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రంగులు చల్లుకుంటూ సరదాగా గడుపుతారు. అయితే, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. హోలీ రోజున కొన్ని వాస్తు సంబంధిత పద్ధతులు పాటిస్తే జీవితంలో ఎదుర్కొనే కష్టాలు తీరుతాయట. కుటుంబ పురోగతి, ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం ఉంటుందట. అలాగే.. ఆర్థిక సమస్యలు సైతం తొలగిపోతాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. హోలీ రోజున కొన్ని వాస్తు నిబంధనలు పాటిస్తే కుటుంబంలో పేదరికం, దుఃఖం, బాధలు తొలగిపోతాయంటున్న పండితులు. మరి జ్యోతిష్యం ప్రకారం ఎలాంటి వాస్తు నిబంధనలు పాటించాలో ఒకసారి చూద్దాం..

1. హోలీ అంటే రంగుల పండుగ. ఈ రోజున దేవతలకు ఇష్టమైన రంగులతో రంగోలీని తయారు చేయడం శుభప్రదం. సంపదల దేవతగా పేరుగాంచిన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి బయట పసుపు, ఎరుపు రంగుతో రంగోలిని వేయాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడంతో పాటు.. అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

2. ఇంట్లో, కుటుంబంలో ఉన్న ప్రతికూలతను తొలగించడానికి.. హోలీ రోజున ఇంట్లో చెట్లు, మొక్కలు నాటాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కలు నాటడం ద్వారా కూడా ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఇంటికి మంచిగా భావించే మొక్కలను నాటడానికి హోలీ రోజును చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

3. భార్య, భర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నట్లయితే.. హోలీ రోజున గదిలో రాధా-కృష్ణుల చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలి. శ్రీకృష్ణుడు, రాధ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. తద్వారా, భార్యభర్తల మధ్య ఉన్న ఘర్షణలు తొలగిపోతాయట.

4. డబ్బు కొరతను అధిగమించడానికి వాస్తు శాస్త్రంలో చాలా పరిష్కారాలు ఉన్నాయి. అయితే, హోలీ రోజున మీ కార్యాలయంలో, మీ ఇంట్లో సూర్య భగవానుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. సూర్యుడి ఫోటోను ఏర్పాటు చేసేటప్పుడు పూర్తి భక్తిశ్రద్దలతో పూజించాలి. వాస్తు ప్రకారం.. సూర్యుడు ఉదయించే చిత్రాన్ని ఆఫీసులో, ఇంట్లో, దుకాణంలో తూర్పు దిశలో మాత్రమే పెట్టాలని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను మత విశ్వసాలు, జ్యోతిష్య గ్రంధాల ఆధారంగా.. ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also read:

Sapota Benefits: సపోటా ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Telangana: పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

LIC IPO: ఆలస్యం కానున్న ఎల్‌ఐసీ ఐపీఓ..! మార్కెట్‌ అస్థిరతే కారణమా..