AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mermaid mummy: ‘మత్స్యకన్య’ ! కోతి-చేప కలయికే కారణమా..? మతి పోగొట్టే విషయాలు !

జపాన్‌లోని ఒకాయమా ప్రిఫెక్చర్ దేవాలయంలోని ఓ పెట్టెలో లభించిన 12 అంగుళాలు (30.5 సెంటీమీటర్లు) పొడవు ఉన్న మమ్మీ ఇప్పుడు సంచలనంగా మారింది.

Mermaid mummy: ‘మత్స్యకన్య’ ! కోతి-చేప కలయికే కారణమా..? మతి పోగొట్టే విషయాలు !
Mermaid Mummy
Ram Naramaneni
|

Updated on: Mar 14, 2022 | 6:21 PM

Share

300-year-old mummy: ఈజీప్ట్ లో ఎక్కువగా మమ్మీలు కనిపిస్తూ ఉంటాయి. రకరకాల మమ్మీల గురించి ఇప్పటికే చాలా రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా జపాన్‌(Japan)లోని ఒకాయమా ప్రిఫెక్చర్ దేవాలయంలోని ఓ పెట్టెలో లభించిన 12 అంగుళాలు (30.5 సెంటీమీటర్లు) పొడవు ఉన్న మమ్మీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ మమ్మీ చాలా వినూత్నంగా ఉంది. నడుము వరకు మనిషిలా, మిగతా భాగం చేపను పోలి ఉంది. దీంతో  ‘మత్స్యకన్యల’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు మత్స్యకన్యల గురించి చాలా విషయాలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఈ మమ్మీపై పరిశోధనలు జరిగితే చాలా విషయాలు బయపడుతాయంటున్నారు పరిశోధకులు. 300 ఏళ్ల కిందట ఓ మత్స్యకారుడికి దొరికిన ఈ ‘మత్స్యకన్య’ దొరికినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని జాగ్రత్తగా ఆలయంలో భద్రపరిచి ఉంటారని చెబుతున్నారు. ఆ పెట్టలో దొరికిన ఆధారాల ప్రకారం 1736-1741 మధ్య కాలంలో ఒక  జాలరి.. ఈ మత్స్యకన్యను  పట్టుకున్నాడని చెబుతున్నారు. కురాషికి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు ఈ మమ్మీపై పరిశోధనలు జరుపుతున్నారు. దాని DNA నమూనాలను సైతం పరిశీలిస్తున్నారు. ఫలితాలు ఈ ఏడాదిలో ప్రకటించే అవకాశాలున్నాయి.   పురాణాల్లో, జానపద కథల్లో కూడా ఈ ‘మత్స్యకన్య’ ల గురించి ప్రస్తావన ఉంది.  జపాన్, కొరియా ప్రజలు మత్స్యకన్యల గురించి ఎక్కువగా నమ్ముతారు. మత్య్సకన్యలను తింటే అమరత్వం లభిస్తుందని అక్కడి ప్రజల విశ్వాసం.  అది కోతి-చేప కలయిక వల్ల పుట్టిన కొత్త జాతి కావచ్చని కొందరు చెబుతున్నారు. పరిశోధనలు పూర్తియితేనే పూర్తి క్లారిటీ వస్తుంది.

Also Read: Andhra Pradesh: బైక్ నడుపుతుండగా వినిపించిన వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై