AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Vedio: ఏందిరా.. ఏందిది.. ఇది ఏ భాష పాటో కనిపెడితే మీకన్నా గ్రేట్ ఎవ్వరూ ఉండరు..

Fanny vedio: సంగీతం.. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని కదిలిస్తుంది.. శ్రావ్యమైన సంగీతానికి రాళ్ళుసైతం కరుగుతాయని అంటుంటారు.. మానసిక ప్రశాంతతకు సరైన మందు పాటలే..

Funny Vedio: ఏందిరా.. ఏందిది.. ఇది ఏ భాష పాటో కనిపెడితే మీకన్నా గ్రేట్ ఎవ్వరూ ఉండరు..
Singer
Rajeev Rayala
|

Updated on: Mar 14, 2022 | 7:16 PM

Share

Funny Vedio: సంగీతం.. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని కదిలిస్తుంది.. శ్రావ్యమైన సంగీతానికి రాళ్ళుసైతం కరుగుతాయని అంటుంటారు.. మానసిక ప్రశాంతతకు సరైన మందు పాటలే.. అందమైన పాటలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. సంగీతంతో సగం రోగాన్ని తగ్గించొచ్చు అంటారు కొందరు. శ్యావ్యమైన సంగీతానికి అందమైన గొంతు కలిస్తే ఆ పాట ఎంతబాగుంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో ఓ పాట తెగ చక్కర్లు కొడుతుంది. క్లబ్ లలో , పబ్ లలో కాన్సెంట్స్ జరగడం మాములే.. గిటార్ భుజాన తగిలించుకొని తమ పాటలతో ఉర్రుతలూగిస్తుంటారు సింగర్స్..అయితే ఇక్కడ కూడా ఓ సింగర్ అదే చేశాడు. గిటార్ వాయిస్తూ ఓ పాటను అందుకున్నాడు.. ఇందులో ఏముంది అనుకుంటున్నారా.. అసలు విషయం అంతా ఇక్కడే ఉంది.

గిటార్ వాయిస్తూ ఎంతో సీరియస్ గా పాట పాడాడు. అయితే అతడు ఏభాషలో పాడుతున్నాడో మాత్రం అర్ధం కావడం లేదు. అతను పాడుతున్నాడో.. లేక ఏడుస్తున్నాడో అర్ధం కాక తెగ నవ్వుకుంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మనోడి పాటకు నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ అద్భుతమైన.. అందమైన పాట పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by MeMeS LoVeRs (@anpadh.balak)

Samsung Galaxy M53 5G: శామ్‌సంగ్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్.. లీకైన వివరాలు.. ఫీచర్స్ చూస్తే వావ్ అంటారు..!

Holi 2022: హోలీ రోజున ఈ వాస్తు పద్ధతలు పాటిస్తే ఏళ్లుగా పట్టిపీడిస్తున్న ఆర్థిక సమస్యలు దూరమవుతాయట..!

Fact Check: సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలను గుడ్డిగా నమ్ముతున్నారా.? అయితే మీరు నెట్టింట్లో కాలు వేసినట్లే.