Samsung Galaxy M53 5G: శామ్‌సంగ్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్.. లీకైన వివరాలు.. ఫీచర్స్ చూస్తే వావ్ అంటారు..!
Samsung Galaxy M53: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ శాంసంగ్ త్వరలో తన M సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది.
Samsung Galaxy M53: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ శాంసంగ్ త్వరలో తన M సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. Samsung Galaxy M53 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. అయితే, ఈ ఫోన్‌కు సంబంధించి వివరాలను అధికారికంగా ప్రకటించక ముందే.. ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. లాంచ్‌కు ముందే ఫోన్ ఫీచర్స్‌ను తెలిపే వీడియోలో ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. ఇందులో ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్ వెల్లడించారు. ఈ వీడియో ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ హోల్ పంచ్ డిస్‌ప్లే ఇవ్వడం జరిగింది. అలాగే మీడియా టెక్ డైమెన్సిటీ 900 5జీ ప్రాసెసర్ ఉండనుంది. 12Hz రిఫ్రెష్ రేట్‌తో ఇది పని చేయనుంది. ఈ ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా ఉంది. అ లాగే 108 మెగా పిక్సెల్‌తో ప్రధాన కెమెరా ఇచ్చారు.
Samsung Galaxy M53 5G అంచనా ధర.. అనధికారిక సమాచారం ప్రకారం.. వియత్నాంలో Samsung Galaxy M53 5G (8GB RAM + 128GB) మోడల్ ధర రూ. 35,100 నుంచి 36,800 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, ఈ ఫోన్ ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉండనుందని సమాచారం.
Samsung Galaxy M53 5G ఫీచర్లు.. Samsung Galaxy M53 5G లాంచ్‌కు ముందే ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, ఫోన్ MediaTek Dimensity 900 5G ప్రాసెసర్‌తో రావచ్చు, ఇది 8GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని తెలుస్తోంది. ర్యామ్, ఇంటర్నల్ స్టోరీజీ రెండూ కూడా కాన్ఫిగరేషన్‌లలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజీ, 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజీతో రెండు వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. అలాగే ఈ ఫోన్.. 5,000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనుంది.
కెమెరా ఫీచర్స్.. ఈ హ్యాండ్‌సెట్‌లో LED ఫ్లాష్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రియర్ కెమెరా 108-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఫ్రంట్ కెమెరా 32-మెగాపిక్సెల్‌తో వస్తుంది.
Also read:
Password Alert: పాస్ వర్డ్ విషయంలో మీరు ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు