AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamala Harris: అమెరికా ఉపాధ్యాక్షురాలి కొంప ముంచిన ‘నవ్వు’.. సోషల్ మీడియా వేదికగా ఏకిపారిస్తున్న జనాలు..

Kamala Harris: నవ్వడం ఓ భోగం అన్నారు. కాని అసందర్భంగా నవ్వితే.. ఇదిగో ఇలా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లా నవ్వులపాలు కాక తప్పదు.

Kamala Harris: అమెరికా ఉపాధ్యాక్షురాలి కొంప ముంచిన ‘నవ్వు’.. సోషల్ మీడియా వేదికగా ఏకిపారిస్తున్న జనాలు..
Kamala Harris
Shiva Prajapati
|

Updated on: Mar 13, 2022 | 6:10 AM

Share

Kamala Harris: నవ్వడం ఓ భోగం అన్నారు. కాని అసందర్భంగా నవ్వితే.. ఇదిగో ఇలా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లా నవ్వులపాలు కాక తప్పదు. వివరాల్లోకెళితే.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ పదే పదే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రెస్‌మీట్లలో అనవసరమైన సమయాల్లో నవ్వుతూ.. నవ్వులపాలవుతున్నారు. నాటోలో భాగమైన తూర్పు యూరప్‌ మిత్ర దేశాలకు మద్దతుగా కమలా హారిస్ పొలండ్ రాజధాని వార్సా వెళ్లారు. అక్కడ పోలాండ్‌ అధ్యక్షుడు పోలెండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దువాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వారికి ఎదురైన ప్రశ్నకు సమాధానం చెప్తూ నవ్వేశారు.

రష్యా దాడితో ఉక్రెయిన్‌ వాసులు ప్రాణభయంతో దేశం దాటి వలస వెళ్తున్నారు. సర్వం కోల్పోయి, నిస్సహాయ స్థితిలో శరణార్థులుగా తరలిపోతోన్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటోంది. ఇప్పుడు వారిని ఆదుకునే నాథుడెవరని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదే విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ను ప్రశ్నించగా.. ఆమె పెద్దగా నవ్వుతూ కనిపించారు. శరణార్థులకు సహకరించమని మీరు అమెరికాను అడగాలనుకుంటున్నారా..? అని పోలండ్ అధ్యక్షుడిని పాత్రికేయులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ముందుగా పోలండ్ అధ్యక్షుడు సమాధానం చెప్తారేమోనని హారిస్ ఆయనవైపు చూశారు.

అనంతరం అవసరంలో ఆదుకున్న స్నేహితుడే నిజమైన స్నేహితుడని వ్యాఖ్యానిస్తూ.. కమలా హారిస్‌ కొన్ని క్షణాల పాటు గట్టిగా నవ్వారు. అయితే అమెరికా వారిని స్వీకరిస్తుందా..? అనే దానిపై మాత్రం ఆమె సమాధానం ఇవ్వలేదు. అక్కడి ప్రజలు అంత బాధలు ఎదుర్కొంటోన్న సమయంలో నవ్వడానికేముందంటూ ట్విటర్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 80 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని ఇలాంటి మానవతా సంక్షోభం గురించి మాట్లాడేప్పుడు వేదికపై నవ్వడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

Also read:

Health Tips: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

Telangana: అసెంబ్లీలో నవ్వులే నవ్వులు.. భట్టి విక్రమార్క కామెడీకి పడి పడి నవ్విన మంత్రి కేటీఆర్..

Andhra Pradesh: ఏపీలో షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగా ట్రైన్ కింద పడ్డ యువకుడు.. హడలెత్తిస్తున్న దృశ్యాలు..!

వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?