AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Crisis: అలా జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే.. అమెరికా అధ్యక్షుడి నోట ఆసక్తికర వ్యాఖ్యలు..

Russia – Ukraine War: రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాల దౌత్యవేత్తల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో 17 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సేనలు దాడులు చేస్తూనే ఉన్నాయి.

Russia Ukraine Crisis: అలా జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే.. అమెరికా అధ్యక్షుడి నోట ఆసక్తికర వ్యాఖ్యలు..
Basha Shek
|

Updated on: Mar 12, 2022 | 8:28 AM

Share

Russia – Ukraine War: రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాల దౌత్యవేత్తల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో 17 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సేనలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను నలువైపులా చుట్టుముట్టాయి పుతిన సేనలు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌ వ్యవహారంలో పుతిన్‌ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అగ్రరాజ్యం అమెరికా తాజాగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యా నుంచి దిగుమతయ్యే మద్యం, సీఫుడ్, వజ్రాలు తదితర పలు ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రకటించారు. ఈ నిషేధం వెంటనే అమ‌లయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రష్యా సైనికుల చేతిలో దెబ్బతింటోన్న ఉక్రెయిన్‌కు13.6 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు అమెరికా సెనేట్ సభ్యులు ఆమోదం తెలిపారు.

మా బలగాలను పంపం..

కాగా ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ బలగాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పంపించబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. ‘నేను ఇక్కడ ఓ విషయం స్పష్టం చేయదలచుకున్నాను. నాటో భూభాగాలలోని ప్రతి అంగుళాన్నీ మేం కాపాడుకుంటాం. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా తగిన మూల్యమే చెల్లించుకుంటుంది. ఉక్రెయిన్ పుతిన్‌కు ఎప్పటికీ విజయం కాదు. పుతిన్ బహుశా ఓ నగరాన్ని స్వాధీనం చేసుకుని ఉండొచ్చు.. కానీ ఓ దేశాన్ని ఆయన ఎప్పటికీ హస్తగతం చేసుకోలేరు. అలా అని మేం ఉక్రెయిన్‌లో రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగం. ఉక్రెయిన్‌కు మద్దతుగా మా బలగాలను పంపించే అవకాశమే లేదు. ఒకవేళ నాటో దేశాలు, రష్యాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ తలెత్తితే అది మూడో ప్రపంచ యుద్ధమే’ అంటూ బైడెన్‌ తెలిపారు. Also Read: Chiranjeevi : సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌లో మెగాస్టార్ చిరంజీవి.. విషయం ఏంటంటే

TSACS jobs: డిగ్రీ అర్హతతో..తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Fab phone Fest: అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ వచ్చేసింది.. స్మార్ట్‌ ఫోన్‌లపై ఉన్న బెస్ట్‌ ఆఫర్స్‌ ఇవే..