AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Longest Car: ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు.. గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్‌.. సదుపాయాలు అదుర్స్‌

Longest Car: మార్కెట్లో చాలా ఖరీదైన కార్లను చూస్తుంటాము. కానీ అతి పొడవైన కార్లు చూసి ఉండము. అత్యంత పొడవైన కారు ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. ఇది ప్రపంచంలోనే..

Longest Car: ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు.. గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్‌.. సదుపాయాలు అదుర్స్‌
Subhash Goud
|

Updated on: Mar 11, 2022 | 9:05 PM

Share

Longest Car: మార్కెట్లో చాలా ఖరీదైన కార్లను చూస్తుంటాము. కానీ అతి పొడవైన కార్లు చూసి ఉండము. అత్యంత పొడవైన కారు ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. ఇది ప్రపంచంలోనే (World) అత్యంత పొడవైన కారు (Longest Car). దీని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ (Guiness Book Of Records)లో కూడా నమోదు చేయబడింది. ఈ కారు ఎంత పొడవు, ఈ కారులో ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు పేరు అమెరికన్ డ్రీమ్స్. అమెరికన్ డ్రీమ్స్ చాలా సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు. ఈ కారు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదు చేయబడింది. ఈ కారు 1986 సంవత్సరంలో తయారు చేయబడింది. ఈ కారును తయారు చేసిన వ్యక్తి పేరు కాలిఫోర్నియాకు చెందిన జే ఓర్‌బర్గ్. అయితే ఇప్పుడు ఈ కారు మరోసారి వెలుగులోకి వచ్చింది. నిజానికి 1986లో తయారైన ఈ కారు ఇప్పుడు మరోసారి పునర్నిర్మించబడింది. అంటే ఈ కారు చాలా కాలం పాటు మరమ్మత్తుల్లో ఉండగా, ఇది ఒక వ్యక్తిచే రీడిజైన్ చేయబడింది. ఇప్పుడు ఈ కారు తన రికార్డును బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా అవతరించింది.

ఈ కారు ప్రత్యేకత ఏమిటి?

ఇది కస్టమైజ్డ్ లిమోసిన్ కారు. ఈ కారు పొడవు 100 అడుగులు అంటే 30.45 మీటర్లు. ఈ కారుకు 26 టైర్లు ఉన్నాయి. కారుకు ఇరువైపులా రెండు ఇంజన్లు ఉన్నాయి. సాధారణంగా 10 నుండి 15 అడుగుల మధ్య ఉన్నప్పటికీ, ఇది 100 అడుగుల పొడవు ఉంటుంది. ఈ కారును రెండు వైపుల నుండి నడపవచ్చు. ఈ కారు పొడవుగా ఉండటమే కాదు, ఇది చాలా లగ్జరీ అనుభవాన్ని కూడా ఇస్తుంది. ఇందులో సీట్లు మాత్రమే కాదు, స్విమ్మింగ్ పూల్, వాటర్‌బెడ్, డైవింగ్ బోర్డ్, జాకుజీ, బాత్‌టబ్, గోల్ఫ్ కోర్స్, హెలిప్యాడ్ కూడా ఉన్నాయి. ఇక 75 మంది ఇందులో కూర్చోవచ్చు. ఈ హెలిప్యాడ్‌పై 5 వేల పౌండ్ల బరువును ఉంచవచ్చు. అంతే కాకుండా టీవీ కార్, ఫ్రీజ్, టెలిఫోన్ సహా అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Petrol Diesel Price: లీటర్‌ పెట్రోల్‌ @254.. ఎక్కడో తెలుసా..?

BMW SUV: బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త కారు.. ధర, ఫీచర్స్‌ వివరాలు