AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌లో మెగాస్టార్ చిరంజీవి.. విషయం ఏంటంటే

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే..

Chiranjeevi : సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌లో మెగాస్టార్ చిరంజీవి.. విషయం ఏంటంటే
Megstar , Salman Khan
Rajeev Rayala
|

Updated on: Mar 12, 2022 | 8:15 AM

Share

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ చిరు ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఆచార్య తర్వాత మెగాస్టార్ వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాను తెలుగు గాడ్ ఫాదర్(Godfather) అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాలో నయన తార నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేశారట.అలాగే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించనున్నారు. మలయాళంలో  ‘లూసిఫర్’ కి ఇది రీమేక్. ఆ సినిమాలో పృథ్వీరాజ్ చేసిన పాత్రకిగాను తెలుగు రీమేక్ లో సల్మాన్ నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ షూటింగ్ కోసం చిరంజీవి హైదరాబాద్ నుండి వెళ్లి ముంబైకి వెళ్లాల్సి వస్తోంది. సల్మాన్ – చిరు ముంబైలోని ఒక ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో వారం రోజుల పాటు షూటింగ్ జరుపుకోనున్నారు. చిత్రీకరణ సమయంలో చిరు – సల్మాన్ ముంబైలోని ఖరీదైన పన్వెల్ ఫామ్ హౌస్ లో ఉంటారని తెలిసింది. అత్యంత విలాసవంతమైన ఈ ఫామ్ హౌస్ లో సల్మాన్ కి అత్యంత ఆత్మీయులు మాత్రమే విడిది చేస్తారట. సల్మాన్ భాయ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల చిరునే అక్కడకు వెళ్లాల్సి వస్తుందట..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: డిఫరెంట్ డ్రెస్సులతో పిచ్చెకిస్తున్న పూజ హెగ్డే.. చూస్తే వావ్ అనాల్సిందే

Surbhi: సరికొత్త లుక్ లో అందాల భామ సురభి… నెట్టింట ఫోటోస్ వైరల్

Radhe Shyam: రాధేశ్యామ్‌ స్లోగా ఉందన్న వారికి.. అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన థమన్‌.. వైరల్‌ అవుతోన్న మీమ్‌..

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!