Sushmita Sen: లలిత్‌ మోడీతో ప్రేమ, పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన సుస్మితా సేన్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్ తన రిలేషన్ షిప్ గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో పలువురు స్టార్ హీరోలు, క్రికెటర్లతో ఆమె ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కొన్ని నెలల క్రితం ఐపీఎల్‌ వ్యవస్థాపకులు లలిత్‌ మోడీతో కలిసి సుస్మిత సేన్‌ దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే.

Sushmita Sen: లలిత్‌ మోడీతో ప్రేమ, పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన సుస్మితా సేన్‌
Lalit Modi, Sushmita Sen
Follow us
Basha Shek

|

Updated on: Nov 19, 2023 | 7:57 PM

ప్రముఖ బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్ తన రిలేషన్ షిప్ గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో పలువురు స్టార్ హీరోలు, క్రికెటర్లతో ఆమె ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కొన్ని నెలల క్రితం ఐపీఎల్‌ వ్యవస్థాపకులు లలిత్‌ మోడీతో కలిసి సుస్మిత సేన్‌ దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. కొన్ని నెలల తర్వాత వారి సంబంధం ముగిసింది. కొంతకాలంగా ఒంటరిగా ఉన్న సుస్మితా సేన్ మళ్లీ ప్రేమ వలలో పడింది. సుస్మితా సేన్ తన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో డేటింగ్ చేస్తోంది. సుస్మితా సేన్ లలిత్ మోడీతో డేటింగ్ చేసినప్పుడు చాలా మంది విమర్శించారు. డబ్బు కోసమే లలిత్ మోదీతో తిరుగుతుందని పలువురు విమర్శించారు. దీనికి సుస్మిత కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది. లలిత్ మోడీని పెళ్లి చేసుకునే ఆలోచన లేదని గట్టిగానే సమాధానమిచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ వయసులో తనకంటే చిన్న వాడైన తన బాయ్‌ ఫ్రెండ్‌ రోహ్మాన్ షాల్‌తో డేటింగ్ చేస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి తిరుగుతున్న ఫొటోలు కూడా ఇటీవల బయటకు వచ్చాయి. ఈ సంగతి పక్కన పెడితే ఇటీవలే ఆర్య సీజన్‌ 3 వెబ్ సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించింది సుస్మిత. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం దీనికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తాజాగా ఆర్య 3 సిరీస్‌ ప్రమోషన్లలో పాల్గొన్న తన వ్యక్తిగత జీవితంపై స్పందించింది. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అందులో లలిత్‌ మోడీతో రిలేషన్‌ షిప్‌ వ్యవహారం కూడా ఉంది.

‘నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకంటే చేసుకుంటా. అంతే కానీ ఇలా చేయను. ఇష్టముంటే చేసుకుంటా అంతే. నాపై వచ్చిన మీమ్స్ చూస్తే చాలా ఫన్నీగా అనిపించాయి. మీరు ఎవరినైనా గోల్డ్ డిగ్గర్ అని పిలిచేముందు నిజాలు తెలుసుకోండి. నేను బంగారం కంటే ఎక్కువగా వజ్రాలను ఇష్టపడతాను. మనం నిశ్శబ్దంగా ఉంటే మౌనాన్ని బలహీనతగా భావిస్తారు. అందుకే వారికి తెలియజేయడానికి నేను ఒక పోస్ట్ పెట్టవలసి వచ్చింది’ అని సుస్మిత చెప్పుకొచ్చింది. కాగా సుస్మిత ఇప్పుడు రోహ్‌మన్ షాల్‌తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ 2022లో బ్రేకప్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో జంటగా కనిపించారు. దీపావళి సందర్భంగా సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. సుస్మితా సేన్ వయసు 47 ఏళ్లు. రోహ్మన్ షాల్ వయసు 32 ఏళ్లు. అంటే సుస్మిత కంటే రోహ్మాన్ 15 ఏళ్లు చిన్నవాడు.

ఇవి కూడా చదవండి

రోహ్‌మన్ షాల్‌తో సుస్మితా సేన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.