మరోసారి ఆ స్టార్ హీరోకు జోడీగా నివేద థామస్.. 

TV9 Telugu

12 January 2025

మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల నటి నివేదా థామస్. 

నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. 

ఆతర్వాత మరోసారి నానికి జోడీగా నిన్ను కోరి సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. 

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నివేదా థామస్. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చింది నివేదా.

2022లో వచ్చిన శాకిని డాకిని సినిమా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. 

ఇటీవలే 35 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. 

కాగా ఇప్పుడు ఈ చిన్నది మరోసారి నానితో జతకడుతుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.