Sara Ali Khan: సారా అలీ ఖాన్‌ ఫ్యామిలీలో మొత్తం ఎంత మంది ఉంటారో తెలుసా? త్వరలోనే ఇండస్ట్రీలోకి మరో పటౌడీ వారసుడు

సారా అలీ ఖాన్ తాత అంటే సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఎనిమిదవ పటౌడీ నవాబ్. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కూడా. ఇక సారా అలీఖాన్ అమ్మమ్మ షర్మిలా ఠాగూర్ ఒకప్పుడు బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌. 60 నుంచి 70ల మధ్య కాలంలో ఆమె చాలా సినిమాల్లో నటించారు. షర్మిల 1968లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకున్నారు. షర్మిల-మన్సూర్‌లకు ముగ్గురు పిల్లలు. సబా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండగా, సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.

Sara Ali Khan: సారా అలీ ఖాన్‌ ఫ్యామిలీలో మొత్తం ఎంత మంది ఉంటారో తెలుసా? త్వరలోనే ఇండస్ట్రీలోకి మరో పటౌడీ వారసుడు
Sara Ali Khan Family
Follow us
Basha Shek

|

Updated on: Aug 13, 2023 | 7:35 AM

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ శనివారం (ఆగస్టు 12) తన పుట్టినరోజు జరుపుకుంది. ఈసారి బర్త్‌డే సారాకు చాలా స్పెషల్‌. ఎందుకంటే ఆమె లేటెస్ట్‌ సినిమా జరా హత్కే జరా బచ్కే సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈక్రమంలో సారాకు తోటి నటీనటులు, అభిమానులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా సారా అలీఖాన్ సైఫ్ అలీ ఖాన్- అమృత దంపతుల గారాలపట్టి. మరి సారా ఫ్యామిలీలో మొత్తం ఎంత మంది ఉంటారు? వారేం చేస్తున్నారో తెలుసుకుందాం రండి. సారా అలీ ఖాన్ తాత అంటే సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఎనిమిదవ పటౌడీ నవాబ్. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కూడా. ఇక సారా అలీఖాన్ అమ్మమ్మ షర్మిలా ఠాగూర్ ఒకప్పుడు బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌. 60 నుంచి 70ల మధ్య కాలంలో ఆమె చాలా సినిమాల్లో నటించారు. షర్మిల 1968లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకున్నారు. షర్మిల-మన్సూర్‌లకు ముగ్గురు పిల్లలు. సబా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండగా, సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.

సైఫ్ అలీ ఖాన్ తన కంటే 12 ఏళ్లు పెద్దదైన అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అమృత మతం మారింది. అలాగే సినిమా నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. పెళ్లయిన 4 ఏళ్ల తర్వాత సారా అలీ ఖాన్ పుట్టింది. ఆ తర్వాత ఇబ్రహీం అలీఖాన్ జన్మించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత సైఫ్-అమృత విడిపోయారు. ప్రస్తుతం సారా తన తల్లితో కలిసి జీవిస్తోంది. ఇక సారా అలీ కాన్ ‘కేదార్‌నాథ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. క్రేజీ హీరోయిన్‌గా వరుస ఛాన్స్‌లు దక్కించుకుంటోంది. ఇక సారా అలీ ఖాన్ సోదరుడు ఇబ్రహీం కూడా త్వరలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నాడు. ఇక సినీ పరిశ్రమలో సైఫ్ అలీఖాన్‌కు డిమాండ్‌ ఉంది. విలన్‌గా, నటుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమాలో రావణుడి పాత్రలో నటించాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. సైఫ్ నటి కరీనా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు. కరీనా కపూర్ ఖాన్- సైఫ్ అలీఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ కంటే 10 సంవత్సరాలు చిన్నది. వీరిద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జెహ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సైఫ్‌ను పెళ్లి చేసుకున్న సమయంలో చాలామంది కరీనాపై విమర్శల వర్షం గుప్పించారు.

ఇవి కూడా చదవండి

సారా అలీ ఖాన్ లేటెస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.