సల్మాన్‌ ఖాన్‌తో సాలిడ్ డ్యాన్స్‌ చేయించాలన్న ఉద్దేశంతోనే ఈ పాటను పిక్ చేసుకున్నా: ప్రభుదేవా

సౌత్‌ సాంగ్ మరోసారి బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన రాధే సినిమాలో... బన్నీ సూపర్‌ హిట్ నెంబర్ సీటీమార్ సాంగ్ ను రిమిక్స్ చేశారు.

సల్మాన్‌ ఖాన్‌తో సాలిడ్ డ్యాన్స్‌ చేయించాలన్న ఉద్దేశంతోనే ఈ పాటను పిక్ చేసుకున్నా: ప్రభుదేవా
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Apr 30, 2021 | 8:49 AM

prabhu deva: సౌత్‌ సాంగ్ మరోసారి బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన రాధే సినిమాలో… బన్నీ సూపర్‌ హిట్ నెంబర్ సీటీమార్ సాంగ్ ను రిమిక్స్ చేశారు. హుక్స్‌ లైన్స్‌ ను కూడా యాజిటీజ్‌గా వాడేస్తూ దేవీ శ్రీనే మరోసారి ఈ మ్యూజికల్ మ్యాజిక్‌ను రిపీట్‌ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన సీటీమార్ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌ రికార్డ్స్‌ను బద్దలు కొడుతోంది.

అందుకే ఈ క్రేజ్‌ను మరింత క్యాష్ చేసుకునే ప్లాన్‌తో సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు రాధే టీమ్‌.. ఈ వీడియోలో సల్మాన్‌, దిశాతో పాటు డైరెక్టర్‌ ప్రభుదేవా కూడా తన ఫీలింగ్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. తన కెరీర్‌లో వెల్‌ పిక్చరైజ్డ్ సాంగ్స్‌లో సీటీమార్‌ కూడా ఒకటన్నారు సల్మాన్‌ ఖాన్‌.

సల్మాన్‌ ఖాన్‌తో సాలిడ్ డ్యాన్స్‌ చేయించాలన్న ఉద్దేశంతోనే ఈ పాటను పిక్ చేసుకున్నామన్నారు ప్రభుదేవా… సల్మాన్‌ లాంటి సూపర్‌ స్టార్‌తో ఫుట్‌ టాపింగ్ నెంబర్‌లో నటించే ఛాన్స్ వచ్చిన దిశా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. డాన్స్‌ మూమెంట్స్ విషయంలో సల్మాన్ అస్సలు కాంప్రమైజే కారని చెప్పారు ఈ బ్యూటీ. సౌత్‌ మ్యూజిషియన్ దేవీ శ్రీ కంపోజ్ చేసిన ఈ పాటకు.. సౌత్‌ స్టార్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ మూమెంట్స్ కంపోజ్ చేయటం మరో విశేషం.

మరిన్ని ఇక్కడ చదవండి :

Aha OTT: మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆహా.. వంద‌కుపైగా దేశాల్లో కోటికి చేరిన డౌన్‌లోడ్‌లు..

వెనక్కు తగ్గిన ‘నారప్ప’ టీం.. ప్రస్తుత పరిస్థితులలో వాయిదా వేస్తున్నాం అంటూ ట్వీట్..

HariTeja: పాప‌ను వీడియో కాల్‌లో చూసేదాన్ని.. పాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.. ఏమోష‌నల్ అయిన హ‌రితేజ‌.