AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: చిక్కుల్లో రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. ఉద్యోగులను మోసం చేసిన జాకీ భగ్నాని..

తాజాగా పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఉద్యోగులు తమ యాజమాని జాకీ భగ్నానీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలా కాలంగా జీతాలు చెల్లించడం లేదని తెలుస్తోంది. ఈ సంస్థలోని ఓ ఉద్యోగి తనకు.. తన టీంకు వేతనాలు సరిగ్గా రావడం లేదంటూ సోషల్ మీడియాలో సుధీర్ఘమైన నోట్ రాస్తూ సదరు ప్రొడక్షన్ సంస్థ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు

Rakul Preet Singh: చిక్కుల్లో రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. ఉద్యోగులను మోసం చేసిన జాకీ భగ్నాని..
Rakul Preet Singh, Jackky B
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2024 | 9:04 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అక్కడే సెటిల్ అయిన ఈ బ్యూటీ.. ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుంది రకుల్. ఇక ఆమె భర్త బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత. పూజా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు చిత్రాలను నిర్మించారు. అయితే తాజాగా పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఉద్యోగులు తమ యాజమాని జాకీ భగ్నానీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలా కాలంగా జీతాలు చెల్లించడం లేదని తెలుస్తోంది. ఈ సంస్థలోని ఓ ఉద్యోగి తనకు.. తన టీంకు వేతనాలు సరిగ్గా రావడం లేదంటూ సోషల్ మీడియాలో సుధీర్ఘమైన నోట్ రాస్తూ సదరు ప్రొడక్షన్ సంస్థ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కూలీ నంబర్ 1, బడేమియా చోటే మియా (1998), బీవీ నంబర్ 1, ఖామోషీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించింది. కానీ ఆ తర్వాత ఈ బ్యానర్ పై నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇటీవల అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బడే మియా చోటే మియా సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో భారీ నష్టాలను చవిచూసింది పూజా ఎంటర్టైన్మెంట్స్. ఈ క్రంలోనే సినిమాకు పనిచేసినందుకు తమకు ఇవ్వాల్సిన జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఉద్యోగులు. బాలీవుడ్ రూల్స్ ప్రకారం సినిమా పూర్తైన 60 రోజుల్లో బకాయిలన్నీ చెల్లించాలి. కాని సినిమా విడుదలైన ఇప్పటివరకు తమకు 2 నెలల జీతాలు రాలేదని అందులో పనిచేస్తున్న ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. అలాగే ఆ సంస్థలో ఎవరు ఉద్యోగం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

తనతోపాటు పనిచేసిన 100 మందికి ఇవ్వాల్సిన జీతాల కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే అవుట్ డోర్ షూటింగ్స్ జరిగినప్పుడు సరైన తిండి కూడా పెట్టరని.. 3 నెలలు పనిచేస్తే రెండు నెలల జీతం చెల్లించరని.. తాము ఈ విషయాన్ని బయటకు చెప్పడం వల్ల మిగతా వాళ్లైన జాగ్రత్త పడతారని అందుకే ఇలా పోస్టులు పెడుతున్నట్లు మరో ఉద్యోగి తెలిపింది. తాము కష్టపడి పనిచేసిన తర్వాత తమకు రావాల్సిన డబ్బులు అడుగుతున్నామని.. కానీ నిర్మాతల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని.. కష్టపడి సంపాదించిన డబ్బు ఎప్పుడు వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది మరో ఉద్యోగి. అయితే ఉద్యోగస్తుల ఆరోపణలపై ఇప్పటివరకు సదరు సంస్థ నిర్మాతలు స్పందించలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.