TOP9 ET: రిలీజ్‌కు ముందే 385 కోట్లు.. | పవన్ ఆన్ డ్యూటీ సింగిల్ ఫోన్‌తో సమస్యకు పరిష్కారం.
చెప్పడమే కాదు.. చేసి చూపించడమే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్.. యస్.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా డ్యూటీ ఎక్కేశారు. ఓవైపు అధికారులతో సమీక్షలు జరుపుతూనే మరోవైపు ప్రజల్లో వ్యక్తిగా కలిసిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి వచ్చిన పబ్లిక్ పట్ల డిప్యూటీ సీఎం పవన్ తనదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. వారి నుండి అర్జీలు తీసుకుని అధికారులకు అక్కడికక్కడే కాల్ చేసి, సమస్యలు పరిష్కరిస్తున్నారు.
01.kalki prabhas: రిలీజ్‌కు ముందే 385 కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్.
ఎప్పటిలానే రిలీజ్‌కు ముందే ప్రభాస్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దిమ్మతిరిగే రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇక ప్రభాస్ లేటెస్ట్… మోస్ట్ అవేటెడ్ మూవీ కల్కి సినిమా కూడా ఇదే చేస్తోంది. జూన్ 27న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ.. ఇప్పటికే దాదాపు 385 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఏరియాల వారిగా.. తెలుగు రాష్ట్రాల్లో 180 కోట్లు, హిందీలో 80 కోట్లు, కర్ణాటకలో 28 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, కేరళలో 6 కోట్లు.. ఓవర్సీస్‌లో 70 కోట్లుగా.. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగట్లుగా తెలుస్తోంది.
02.kalki prabhas: PAYTMలోనూ రికార్డే.. ఇక నువ్వు.. దేన్ని వదులుతావయ్యా.!
ఓ పక్క కల్కి ప్రీ టికెట్ సేల్స్‌తో.. ఓవర్సీస్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్.. మరో పక్క ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీనే షేక్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ఇప్పుడు కాదేని తన రికార్డులకనర్హం అన్నట్టు.. పేటీఎంలోనూ దుమ్ముదులుపుతున్నాడు. పేటీఎం టికెట్ బుకింగ్ సెక్షన్‌లో.. కల్కి మూవీ కోసం వెయిట్ చేస్తున్న వారు తాజాగా 10 లక్షలకు.. అంటే 1 మిలియన్ కు చేరారు. దీంతో పేటీంలో కూడా ప్రభాస్ ట్రెండ్ అవుతున్నాడు.
03.kalki prbahs: రూ. 250 కోట్లు రెమ్యూనరేషన్‌కే..
రీసెంట్‌గా రిలీజ్ అయిన కల్కి మూవీ థియేట్రికల్ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకోవడమే కాదు.. ఈ సినిమాకు పెట్టిన.. దాదాపు 700 కోట్ల బడ్జెట్‌ను కూడా కళ్లకు కట్టినట్టే చూపించింది. ఈ సినిమా విజువల్ వండర్ గా హిస్టరీ కెక్కబోతుందనే హింట్ అందరికీ ఇచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీలోని స్టార్ యాక్టార్స్‌కు కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్టుగా ఓ న్యూస్ బయటికి వచ్చింది. ప్రభాస్, కమల్, అమితాబ్, దీపిక. ఈ నలుగురి రెమ్యునరేషనే.. దాదాపు 250 కోట్ల అయిందనే ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
04.ntr: నరరూప రాక్షసుడిగా యంగ్ టైగర్.
హీరోయిజం మాత్రమే కాదు.. విలన్ నిజం కూడా ఓ రేంజ్‌లో పండిగలడని.. రావణ సినిమాతో ప్రూఫ్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఆ సినిమాలోని తారక్ విలనిజాన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ను చూశాడో ఏమో తెలీదు కానీ.. ఇప్పుడు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌ను నరరూప రాక్షసుడిగా.. తన అప్‌కమింగ్ ఫిల్మ్‌లో చూపించబోతున్నాడని టాక్. క్రూరత్వం.. రాక్షసత్వం.. కలగలిపి.. తారక్ క్యారెక్టర్‌ను డ్రాగన్‌గా డిజైన్ తన సినిమాలో చేశారట ప్రశాంత్ నీల్. అంతేకాదు ఈ సినిమాలోని తన యంగ్ టైగర్ రోల్‌తో.. ఇండియన్ సినిమాస్ ముందు మరో సెన్సేషన్ సృస్టించాలని చూస్తున్నారట.
05.darshan: పవిత్ర చూస్తుండగానే రేణుకా స్వామికి 3rd డిగ్రీ టార్చర్.
పోలీసుల విచారణ జరుగుతున్న కొద్దీ.. రేణుకా స్వామి హత్య కేసులో సంచలన విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా అలాంటి మరో విషయమే బయటికి వచ్చింది. పవిత్ర చూస్తుండడగానే.. పవిత్ర కళ్ల ముందే..! రేణుకా స్వామికి థర్డ్ డిగ్రీ టార్చర్ చూపించారట దర్శన్ అండ్ టీం. పవిత్రకు, రేణుకా స్వామిపై ఉన్న కోపం చల్లారేందుకే దర్శన్ ఇలా చేయించారని తాజాగా పోలీస్ విచారణలో బయటికి వచ్చింది. మరో సారి దర్శన్, పవిత్రపై కన్నడ నాట విమర్శలు వచ్చేలా చేస్తోంది.
06.darshan: మనిషి కాదు మృగం.. వెలుగులోకి వస్తున్న దర్శన్ ఆగడాలు.
నిన్న మొన్నటి వరకు డీ బాస్ అంటూ.. కన్నడ నాట వెలిగిపోయిన దర్శన్ ఇప్పుడు మనిషి కాదు మృగం అనే విమర్శ ఎదుర్కొంటున్నాడు. రేణుకా స్వామి హత్యలో.. సంచలన విషయాలు బయటికి రావడంతో.. దారుణంగా విమర్శలపాలవుతున్నాడు. ఇక ఈ కమ్రంలోనే తన తోటి ఆర్టిస్టులు.. సెలబ్రిటీలు కొంత మంది ఈ స్టార్ హీరో చేసిన కొన్ని వెకలిచేష్టలను బటయ పెడుతున్నారు. షూటింగ్‌లో అనుచితంగా ప్రవర్తించడం.. శాఖాహారులకు బలవంతంగా మాంసం తినిపించడం. ప్రొడ్యూసర్లను బెదిరించడం.. తాగి అడ్డొచ్చిన వాళ్లను చావ బాదడం వంటివి దర్శన్ తరూచూ చేస్తుంటారని వారు సోషల్ మీడియాలో బాహాటంగా చెబుతున్నారు. దర్శన్ మనిషి కాదు మృగమని.. అతడిని మానసిక వికలాంగుల ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని వారు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
07.renu: నేనేం దురదృష్టవంతురాలిని కాను.. పవన్ ఫ్యాన్‌పై రేణు సీరియస్.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్.. పవన్ ఫ్యాన్ లో ఒకరి పై సీరియస్ అయ్యారు. మీరు అన్‌లక్కీ మేడమ్.. అని ఇండైరెక్ట్ గా ఓ అభిమాని రేణుకు కామెంట్ పెట్టాడు. ఇక ఆ కామెంట్ చూసిన రేణు దేశాయ్.. తాను ఎలా అన్‌లక్కో చెప్పాలంటూ.. ఆ వ్యక్తికి కౌంటర్ కామెంట్ చేశారు. దీన్నో పోస్ట్ గా తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు.
08. kalki: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఇక నో ఈవెంట్.!
జూన్ 27న కల్కి మూవీ రిలీజ్ అవుతున్న వేళ.. ఇప్పుడు సోసల్ మీడియా ఇంట.. బయట మొత్తం కల్కి గురించే డిష్కన్ జరుగుతోంది. ఈ సినిమా ఎలా ఉండనుందో అన్న చర్చ నడుస్తోంది. దాంతో పాటే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడనే ఈగర్ కూడా అందర్లో ఉంది. అయితే ఇప్పుడు అందరూ ఈగర్‌గా ఎదురుచూస్తున్న ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదని తెలుస్తోంది. రిలీజ్‌కు ఇంకా 5 రోజులే ఉండడం.. ఇప్పటికే ఈ మూవీ పై స్కై హై అంచనాలు ఉండడంతో.. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వద్దనుకుంటున్నారట మేకర్స్. దానికి బదులు ప్రభాస్‌తో.. ఓ బిగ్ గ్రాండ్ ఇంటర్వ్యూ ఒకటి ఏర్పాటు చేస్తున్నారట.
09. pawan: పవన్ ఆన్ డ్యూటీ.. సింగిల్ ఫోన్‌తో సమస్యకు పరిష్కారం.
చెప్పడమే కాదు.. చేసి చూపించడమే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్.. యస్.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా డ్యూటీ ఎక్కేశారు. ఓవైపు అధికారులతో సమీక్షలు జరుపుతూనే మరోవైపు ప్రజల్లో వ్యక్తిగా కలిసిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి వచ్చిన పబ్లిక్ పట్ల డిప్యూటీ సీఎం పవన్ తనదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. వారి నుండి అర్జీలు తీసుకుని అధికారులకు అక్కడికక్కడే కాల్ చేసి, సమస్యలు పరిష్కరిస్తున్నారు. అసెంబ్లీ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఆఫీస్ బయట వేచి ఉన్న బాధితులతో పవన్ అక్కడే ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించారు. పుట్టెడు దుఃఖంతో వచ్చిన బాధితులు పవన్ వర్కింగ్ స్టైల్‌కు ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.