Mithun Chakraborty: పెంపుడు కుక్కల కోసం 45 కోట్ల ఆస్తిని కేటాయించిన స్టార్ హీరో..

Mithun Chakraborty: పెంపుడు కుక్కల కోసం 45 కోట్ల ఆస్తిని కేటాయించిన స్టార్ హీరో..

Anil kumar poka

|

Updated on: Jun 24, 2024 | 8:15 AM

సాధారణంగా సినీ పరిశ్రమలోని స్టార్స్ చాలావరకు జంతు ప్రేమికులే. అయితే అందులో ఒకప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి.. అమర ప్రేమికుడు. ఎస్ ! ఎందుకంటే.. ఈ సీనియర్ హీరో తన పెంపుడు కుక్కుల కోసమే ఏకంగా 45 కోట్లు ఆస్తిని కేటాయించారు. ఇప్పుడు ఇదే న్యూస్తో అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తున్నాడు. బీటౌన్ ఇండస్ట్రీలో టాప్ హీరో! 70వ దశకంలో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మిథున్‌.

సాధారణంగా సినీ పరిశ్రమలోని స్టార్స్ చాలావరకు జంతు ప్రేమికులే. అయితే అందులో ఒకప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి.. అమర ప్రేమికుడు. ఎస్ ! ఎందుకంటే.. ఈ సీనియర్ హీరో తన పెంపుడు కుక్కుల కోసమే ఏకంగా 45 కోట్లు ఆస్తిని కేటాయించారు. ఇప్పుడు ఇదే న్యూస్తో అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తున్నాడు. బీటౌన్ ఇండస్ట్రీలో టాప్ హీరో! 70వ దశకంలో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మిథున్‌. ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. ఇప్పుడు నటుడిగా కొన్ని వందల కోట్లు సంపాదించారు. అందులోనూ డాగ్ లవర్‌ కావడంతో.. ఈ స్టార్ హీరో ఏకంగా 116 కుక్కలను దత్తత తీసుకున్నారు.

వాటి కోసం ముంబై సమీపంలోని మాద్ ద్వీపంలో తన విశాలమైన 1.5 ఎకరాల్లో వీటిని పెంచుతున్నారు. అంతేకాదు వాటి సంరక్షణ కోసం 45 కోట్లు విలువైన ఆస్తిని వినియోగిస్తున్నాడట. కోట్లలో ఖర్చు పెడుతున్నారు. కుక్కల కోసం ఆట స్థలాలు, అన్ని అధునిక సౌకర్యాలతో వాటి సంరక్షణ చూసుకుంటున్నాడట. ఇక గతేడాది ఓ ఇంటర్వ్యూలో మిథున్ కోడలు నటి మదాల్సా శర్మ చెప్పడం ఈ విషయం కాస్తా బయటికి వచ్చింది. అప్పటి నుంచి నెట్టింట వైరల్ అవుతూనే.. అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.