Poonam Pandey: ‘నీకో దండం తల్లి’.. పూనమ్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్స్
నేను బ్రతికే ఉన్నా. I'M ALIVE అంటూ పూనమ్ పాండే ఇన్‌స్టాలో పెట్టిన అందరినీ షాక్ గురి చేస్తోంది. సర్వైకల్ కేన్సర్‌తో పూనమ్ చనిపోయారంటూ శుక్రవారం ఆమె టీమ్ ప్రకటించగా.. మరుసటి రోజే స్వయంగా ఆమే ప్రత్యక్షమై ఉన్నానంటూ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ హాట్ టాఫిక్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం సరికాదంటూ విమర్శిస్తున్నారు.

ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణించారన్న వార్త ప్రతి ఒక్కర్ని షాక్‌కు గురి చేసింది. పైగా సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయిందని ప్రకటించడం మరింత కలచివేసింది. సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వీడియోలే తెగ కనపడుతున్నాయి. ఆమె మృతి వార్త బయటకు రావడంతో అందరూ RIP పోస్ట్‌లు పెడుతున్నారు. కొందరు మాత్రం ఆమె మరణవార్తపై సందేహాలు వ్యక్తం చేశారు. ఎప్పుడూ వివాదాల కోరుకునే పూనమ్.. బ్లఫ్ చేస్తోందని భావించారు.
అదే నిజమైంది. చనిపోయారంటూ వార్త వచ్చిన మరుసటి రోజే పూనమ్ ప్రత్యక్షమ్వడం నిజంగా అందరినీ విస్మయానికి గురిచేసింది. తాను చనిపోలేదని.. బ్రతికే ఉన్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేసింది. దురదృష్టవశాత్తు, సర్వైకల్ క్యాన్సర్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే చనిపోయినట్టు నటించానంటూ పూనమ్ పాండే రిలీజ్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చింది. ” గర్భాశయ క్యాన్సర్ వల్ల వేలాది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాదు. దీనిని నిర్మూలించడం సాధ్యమే. HPV వ్యాక్సిన్ లేదా ముందస్తుగా గుర్తించడం అవసరం. ఈ మహమ్మారితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండే మార్గాలు ఉన్నాయి. దీనిపై అవగాహన కల్పిద్దాం” అని ఆమె పేర్కొంది.
View this post on Instagram
దీంతో నెటిజన్లు పూనమ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన కల్పించే పద్దతి ఇదా అంటూ ఫైర్ అవుతున్నారు. జనాలు పిచ్చోళ్లలా కనిపిస్తున్నారా..? ఇలాంటి ప్రచారం సరికాదంటూ విమర్శిస్తున్నారు.

ఇప్పుడే కాదు గతంలో కూడా పూనమ్ పాండే ప్రవర్తన ఇలానే ఉండేది. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానంటూ సంచలనం సృష్టించింది. ఆ స్టేట్‌మెంట్‌తో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. భర్త శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను కంప్లైంట్ చేసి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అయితే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన అంటూ మరో పబ్లిసిటీ స్టంట్‌కు తెరలేపిందంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



