AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Pandey: పూనమ్ రచ్చపై స్పందించిన రామ్‌ గోపాల్ వర్మ.. నీలాగే నీ ఆత్మ కూడా ఆందంగా ఉందంటూ ట్వీట్

పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయినట్లు శుక్రవారం (ఫిబ్రవరి 02) వార్తలు వచ్చాయి. తన మేనేజర్ స్వయంగా చెప్పడంతో ఇదంతా నిజమే అని నమ్మారు. పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు నెట్టింట రిప్‌ పోస్టులు కూడా షేర్‌ చేశాడు. అయితే ఎప్పటిలాగే జనాలను మరోసారి పిచ్చోళ్లను చేసింది పూనమ్‌.

Poonam Pandey: పూనమ్ రచ్చపై స్పందించిన రామ్‌ గోపాల్ వర్మ.. నీలాగే నీ ఆత్మ కూడా ఆందంగా ఉందంటూ ట్వీట్
Ram Gopal Varma, Poonam Pandey
Basha Shek
|

Updated on: Feb 03, 2024 | 4:59 PM

Share

బాలీవుడ్‌ ప్రముఖ నటి, మోడల్ పూనమ్‌ పాండే మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో వివాదాలతోనే ఎక్కువగా హైలెట్‌ అయిన ఈ ముద్దుగుమ్మ ఈసారి అంతకు మించి అనేలా నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయినట్లు శుక్రవారం (ఫిబ్రవరి 02) వార్తలు వచ్చాయి. తన మేనేజర్ స్వయంగా చెప్పడంతో ఇదంతా నిజమే అని నమ్మారు. పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు నెట్టింట రిప్‌ పోస్టులు కూడా షేర్‌ చేశాడు. అయితే ఎప్పటిలాగే జనాలను మరోసారి పిచ్చోళ్లను చేసింది పూనమ్‌. తాను బతికున్నట్లు సోషల్‌ మీడియాలో ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. కేవలం సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానని, క్షమాపణలు కోరింది. దీంతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అదే సమయంలో చావును కూడా పబ్లిసిటీ స్టంట్‌కు వాడుకోవడంపై చాలామంది పూనమ్‌పై ఫైర్‌ అవుతున్నారు. ఆమెను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా పూనమ్‌ పాండే రచ్చపై స్పందించారు. ఏ విషయమైనా వెరైటీగా థింక్‌ చేసే ఆర్జీవీ పూనమ్‌ విషయంలోనూ అలాగే రియాక్ట్‌ అయ్యారు.

‘హేయ్ పూనమ్ పాండే… సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నీవు ఎంచుకున్న విధానం కొంత విమర్శలకు తావివ్వొచ్చు. అందులో చాలా మంచి ఉద్దేశముంది. దానినిఎవరు కాదనలేరు. దీని ద్వారా నువ్వు ప్రజల ప్రేమను పొందొచ్చు, పొందకపోవచ్చు. కానీ ప్రస్తుతం అంతటా గర్భాశయ క్యాన్సర్ పైనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం నువ్వే. మార్గం ఏదైనా అనుకున్నది సాధించావు. నీ మాదిరేగానే నీ ఆత్మ కూడా చాలా అందమైనది. నీవు సంపూర్ణమైన, సంతోషకరమైన జీవితం గడపాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఆర్జీవీ ట్వీట్ ఇదిగో..

నేను బతికే ఉన్నా.. పూనమ్ పాండే వీడియో…

నెటిజన్ల ఆగ్రహం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పుడు క్రికెట్‏లో ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్..
అప్పుడు క్రికెట్‏లో ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్..
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
ఇకపై UPI లావాదేవీలు ఫ్రీ కాదా? ట్రాన్సాక్షన్‌కు పడే ఛార్జి ఎంత
ఇకపై UPI లావాదేవీలు ఫ్రీ కాదా? ట్రాన్సాక్షన్‌కు పడే ఛార్జి ఎంత
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!
దేశంలో మొట్టమొదటి శక్తి దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా..?
దేశంలో మొట్టమొదటి శక్తి దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా..?
స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా?
స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా?
Video: మైదానంలో ఘోర ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు..
Video: మైదానంలో ఘోర ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు..
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి రూ.30 లక్షల వరకు బెనిఫిట్
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి రూ.30 లక్షల వరకు బెనిఫిట్
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!