AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Pandey: ‘నేను చనిపోలేదు’.. వీడియో రిలీజ్ చేసిన పూనమ్ పాండే..

శుక్రవారం తెల్లవారుజామున పూనమ్ చనిపోయినట్లు ఆమె మేనేజర్ ఇన్ స్టా పోస్ట్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె మరణవార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పూనమ్ మరణవార్త విని ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దీంతో జనాలు ఆమె మరణించిందని నమ్మారు. కానీ మృతి చెందినట్లు పోస్ట్ చేసిన 24 గంటలు గడుస్తున్నా ఆమె కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే పూనమ్ డెడ్ బాడీ ఫోటోస్, అంత్యక్రియలకు సంబంధించిన విషయాలు బయటకు రాలేదు.

Poonam Pandey: 'నేను చనిపోలేదు'.. వీడియో రిలీజ్ చేసిన పూనమ్ పాండే..
Poonam Pandey
Rajitha Chanti
|

Updated on: Feb 03, 2024 | 12:56 PM

Share

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే చనిపోలేదు. తాను బతికే ఉన్నానంటూ వీడియోస్ రిలీజ్ చేసింది. కేవలం సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్లు ప్రకటించానని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున పూనమ్ చనిపోయినట్లు ఆమె మేనేజర్ ఇన్ స్టా పోస్ట్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె మరణవార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పూనమ్ మరణవార్త విని ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దీంతో జనాలు ఆమె మరణించిందని నమ్మారు. కానీ మృతి చెందినట్లు పోస్ట్ చేసిన 24 గంటలు గడుస్తున్నా ఆమె కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే పూనమ్ డెడ్ బాడీ ఫోటోస్, అంత్యక్రియలకు సంబంధించిన విషయాలు బయటకు రాలేదు. దీంతో పూనమ్ నిజంగానే చనిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే అసలు ట్విస్ట్ ఇచ్చింది పూనమ్. తాను అసలు చనిపోలేదని.. కేవలం మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటీ ? అనే అవగాహన కల్పించడం కోసమే తాను చనిపోయినట్లు ప్రకటించానని.. నిజానికి ఈ క్యాన్సర్ చాలా మంది మహిళ ప్రాణాలను బలి తీసుకుంటుందని చెప్పుకొచ్చింది.

ఆ వీడియోలో పూనమ్ మాట్లాడుతూ..”నేను చనిపోలేదు. బ్రతికే ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్ వల్ల నాకు ఏమి కాలేదు. కానీ భాదకరమైన విషయం ఏంటంటే.. ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వేలాది మంది మహిళల ప్రాణాలను బలి తీసుకుంది. కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా, గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చు. HPV వ్యాక్సిన్ అనేది ఈ జబ్బును ముందుగా గుర్తిస్తుంది. ఈ వ్యాధితో ఎవరూ చనిపోకుండా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. ” అంటూ చెప్పుకొచ్చింది.

“ఈ సర్వైకల్ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి.. వారిని శక్తివంతులుగా మారుద్దాం. ప్రతి మహిళా తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకునేలా చూసుకుందాం. ఏమి చేయాలనే విషయాలను తెలుసుకోవడానికి బయోలో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. ఈ భయంకరమైన వ్యాధిని ఎదుర్కొనే ప్రయత్నం చేద్దాం ” అని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.