Vijay Varma: పెళ్లెప్పుడు చేసుకుంటారు ?.. నెటిజన్ ప్రశ్నకు తమన్నా ప్రియుడు రియాక్షన్.. ట్విస్ట్ ఇచ్చిన విజయ్ వర్మ..

అదే సమయంలో వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్, ఈవెంట్లలో పాల్గొనడంతో వీరి లవ్ మ్యాటర్ నిజమే అని అనుకున్నారు అంతా. ఇక ఇదే విషయంపై తమన్నా స్పందిస్తూ తామిద్దరం డేటింగ్‏లో ఉన్నామంటూ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అటు విజయ్ వర్మ కూడా తన ప్రేమ విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీరిద్దరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టాలో నెటిజన్లతో ముచ్చటించాడు విజయ్.

Vijay Varma: పెళ్లెప్పుడు చేసుకుంటారు ?.. నెటిజన్ ప్రశ్నకు తమన్నా ప్రియుడు రియాక్షన్.. ట్విస్ట్ ఇచ్చిన విజయ్ వర్మ..
Vijay Varma,tamannaah
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2024 | 11:02 AM

బాలీవుడ్ హీరో విజయ్ వర్మ పేరు కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. లస్ట్ స్టోరీస్ 2 సినిమా సమయంలో టాలీవుడ్ బ్యూటీ తమన్నాతో ఈ హీరో ప్రేమలో ఉన్నాడనే విషయం బయటకు వచ్చింది. అదే సమయంలో వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్, ఈవెంట్లలో పాల్గొనడంతో వీరి లవ్ మ్యాటర్ నిజమే అని అనుకున్నారు అంతా. ఇక ఇదే విషయంపై తమన్నా స్పందిస్తూ తామిద్దరం డేటింగ్‏లో ఉన్నామంటూ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అటు విజయ్ వర్మ కూడా తన ప్రేమ విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీరిద్దరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టాలో నెటిజన్లతో ముచ్చటించాడు విజయ్. ఎప్పుడు నెట్టింట చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్, మూవీ అప్డేట్స్ పంచుకుంటాడు విజయ్.

తాజాగా ఇన్ స్టాలో అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతూ ఆస్క్ మీ ఎనీథింద్ సెషన్ ఏర్పాటు చేశాడు. అందులో ఓ నెటిజన్ విజయ్ వర్మను పెళ్లెప్పుడు చేసుకుంటావు ? అడగ్గా.. చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు. ఆ ప్రశ్న అడిగింది మరెవరో కాదు తన మేనకోడలే అని అసలు విషయం చెప్పేశాడు. ‘నా కోడలు ఇప్పుడు అమ్మలా ప్రశ్నలు అడుగుతుంది. పైగా నాకు ఈ ప్రశ్న హైదరాబాదీ యాసలో వినిపిస్తుంది.’ అంటూ ఫన్నీగా కౌంటరిచ్చాడు. అలాగే మీరు జిమ్ కు వెళ్తారా ? అని మరో నెటిజన్ అడగ్గా.. సినిమాకు ట్రైన్ కావాలని… అప్పుడు మాత్రమే జిమ్ కు వెళ్తానని.. లేకపోతే యోగా ప్రాక్టీస్ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు.

Vijay Varma

Vijay Varma

విజయ్ వర్మ చివరిసారిగా జానే జాన్ అనే సినిమాలో కనిపించాడు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు విజయ్.. అలాగే ప్రస్తుతం అతడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తమిళ్ చిత్రం కూడా. అలాగే విజయ్ వర్మకు సౌత్ ఇండస్ట్రీలోనూ వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by YCOM (@ycomgadgets)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.