మరోసారి తెరపైకి డ్రగ్స్ మాఫియా.. సెలబ్రెటీలకు కొకైన్ సప్లయి చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు…
మహారాష్ట్రలోని మీరా రోడ్, నాలా సోపారా నుంచి డ్రగ్స్ సప్లయి చేస్తున్నవారిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది.
మహారాష్ట్రలోని మీరా రోడ్, నాలా సోపారా నుంచి డ్రగ్స్ సప్లయి చేస్తున్నవారిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది. జూలై 8న రాత్రి మీరా రోడ్, నాలా సోపారా నుంచి డ్రగ్స్ సప్లయి చేస్తున్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిలో ఒకరు నైజీరియాకు చెందిన అతను కాగా.. మరొకరు భారతీయుడు. వీరిద్దరి దగ్గర్నుంచి భారీ మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఈరోజు (జూలై 8న) వీరిద్దరిని కోర్టులో హాజరుపరచనున్నారు.
ట్వీట్..
Maharashtra | NCB arrested 2 drug peddlers from Mira Road & Nala Sopara, y’day night in raid. Of these, one was a Nigerian national. Huge amount of cocaine was seized. Accused used to supply drugs to celebrities. Both the accused will be produced before the court today: NCB
— ANI (@ANI) July 8, 2021
గతేడాది సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం.. దానిపై సీబీఐ విచారణ చేపట్టడంతో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కుంభకోణంలో ఎన్సీబీ విచారణ చేపట్టింది. ఈ కేసులో చాలా మంది సెలబ్రెటీలను విచారించింది ఎన్సీబీ. ఇక అదే విషయంలో సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి జైలు శిక్ష కూడా అనుభవించింది. ఇక కేసులో మొత్తం 33 మంది సెలబ్రెటీల పేర్లను పొందుపరిచింది ఎన్సీబీ. ఇక తర్వాత బెంగుళూరులో కూడా పలువురు సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసే వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. అందులో టాలీవుడ్ సెలబ్రెటీలకు కూడా డ్రగ్స్ అందిస్తున్నట్లుగా విచరణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ అంశం తెరపైకి రావడం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.
Shobha Karandlaje: మోదీ కేబినెట్‌లో మహిళలకు పెద్ద పీట.. అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పదవి వరకు..!
జమ్మూలో ఐఏఎఫ్ పై డ్రోన్ల దాడి ఘటన..బాంబులు పాకిస్తాన్ ఆయుధాగారంలో తయారైనవే ? ఫోరెన్సిక్ నివేదిక