Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌పై చీటింగ్ కేసు… మోసం చేశారంటూ ఫిర్యాదు..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై చండీగఢ్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సల్మాన్‌తోపాటు... సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితోపాటు..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై చండీగఢ్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సల్మాన్‌తోపాటు… సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితోపాటు.. ఆయనకు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ చెందిన ఏడుగురిపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయంపై జూలై 13లోపు వివరణ ఇవ్వాలని సమన్లు కూడా జారీ చేశారు. ఈ ఆరోపణలలో ఏదైనా నేర కోణం ఉంటే తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు.
ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు నన్ను ఆ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని అడిగారు. ఇందుకు పెట్టుబడి ఖర్చు రూ. 2 కోట్లు అవుతుందని చెప్పగా అందుకు అంగీకరించి అంత మొత్తాన్ని ఖర్చుపెట్టినట్లు తెలిపారు. కాగా షోరూమ్ తెరచిన సంవత్సరం గడుస్తున్న తనకు సదరు సంస్థ నుంచి ఏవీ రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట్లో ఈ విషయమై ఆ సంస్థ ఉద్యోగులు సల్మాన్ ఖాన్‌తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పారు. ఈ క్రమంలో అతను సల్మాన్‌ను కలుసుకోగా.. షోరూమ్ ప్రారంభించేందుకు కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. ఈ క్రమంలో సల్మాన్‌ను కలుసుకోగా.. షోరూమ్ ప్రారంభించేందుకు వస్తానని హామీ ఇచ్చాడని.. ఆ తర్వాత సల్మాన్ రాలేదని అరుణ్ గుప్తా తెలిపాడు. దీంతో సల్మాన్, ఆయన సోదరి అల్విరా, సదరు సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగిరిపై కేసు నమోదైంది. షోరూమ్ ప్రారంభించి 1.5 సంవత్సరాలు గడుస్తున్న నాకు ఎలాంటి సమాధానం వాళ్ల నుంచి రాలేదని అరుణ్ గుప్తా ఫిర్యాదులో పేర్కోన్నారు.
ట్వీట్..
Chandigarh police summon Bollywood actor Salman Khan, his sister Alvira Khan and 7 others associated with Being Human in an alleged case of fraud.
“They have been given till July 13 to reply. If there’s anything criminal, action will be taken,” Chandigarh SP Ketan Bansal. pic.twitter.com/Ye2dI97aN5
— ANI (@ANI) July 8, 2021
Vicky-Katrina: వేదికపై కత్రినాకు ప్రపోజ్ చేసిన విక్కీ కౌశల్.. తెగ నవ్వుకున్న మాజీ ప్రియుడు సల్మాన్..