Vicky-Katrina: వేదికపై కత్రినాకు ప్రపోజ్ చేసిన విక్కీ కౌశల్.. తెగ నవ్వుకున్న మాజీ ప్రియుడు సల్మాన్..

బాలీవుడ్‏లోని ప్రేమ జంటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ కపూర్ -మలైక అరోరా, రణ్‏బీర్ కపూర్-అలియా భట్,

Vicky-Katrina: వేదికపై కత్రినాకు ప్రపోజ్ చేసిన విక్కీ కౌశల్.. తెగ నవ్వుకున్న మాజీ ప్రియుడు సల్మాన్..
Katrina Kaif
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 08, 2021 | 11:49 AM

బాలీవుడ్‏లోని ప్రేమ జంటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ కపూర్ -మలైక అరోరా, రణ్‏బీర్ కపూర్-అలియా భట్, దిశ పటాని-టైగర్ ష్రాఫ్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ గురించి బాలీవుడ్ మీడియా ఎన్నో కథనాలు వినిపిస్తుంటాయి. అయితే కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చినా.. వారిద్దరూ తాము మంచి స్నేహితులమంటూ చెప్పుకోచ్చారు. గతంలో హీరోయిన్ సోనమ్ కపూర్ సోదరుడు హర్షవర్ధన్.. వీరిద్దరూ రిలేషన్‏షిప్‏లో ఉన్నారంటూ బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకు చెప్పినందుకు తనకు సమస్యలు కూడా ఎదురుకావచ్చంటూ చెప్పుకొచ్చాడు హర్షవర్ధన్. దీంతో కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ప్రేమ వ్యవహరం పై వస్తున్న పుకార్లకు మరింత బలం చేకూరింది.

ఇక సూర్య వంశీ ప్రమోషన్‏లో బిజీగా ఉన్న కత్రినాను దర్శక నిర్మాత కరణ్ జోహార్-అక్షయ్ కుమార్ ఓ రేంజ్‏లో ఆట పట్టించారు. కత్రినా ఇంట్లో ఏదో జరుగుతోంది అంటూ అక్షయ్ కామెంట్ చేశారు. అయితే తాజాగా ఇప్పుడు ఓ అవార్డు ఫంక్షన్‏లో విక్కీ కౌశల్ నేరుగా ఓపెన్ అయిపోయారు. వేదికపై విక్కీ కౌశల్ హోస్ట్‏గా వ్యవహరిస్తున్నారు. ఇక అదే సమయంలో అవార్డు అందించడానికి వచ్చిన కత్రినా మాజీ ప్రియుడు సల్మాన్ ముందు వరుసలో కూర్చున్నాడు. ఆకస్మాత్తుగా కత్రినాను నేరుగా విక్కీ కౌశల్ లాంటి కుర్రాడ్ని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా అంటూ ప్రశ్నించారు. దీంతో కత్రినా కాస్తా ఆశ్చర్యానికి గురై ఆ తర్వాత నవ్వుకుంది. అయితే ముందు వరుసలో కూర్చున్న సల్మాన్ మాత్రం తెగ నవ్వుకున్నారు. పక్కనే ఉన్న చెల్లెలు అర్పిత భుజాలాపై వాలిపోయి మరీ నవ్వడం హైలైట్ అయ్యింది.

ట్వీట్..

Also Read: Karthika Deepam: మోనితకు షాక్ మీద షాక్.. నీది ప్రేమ కాదు పంతం అన్న కార్తీక్.. దీపకు కీలక విషయం చెప్పిన ఆదిత్య..

Dangerous Claimate Change..అంటార్కిటికాలో కరిగిపోతున్న మంచు కొండలు..మూడు రోజుల్లో సరస్సు ‘మాయం’ !

Hyderabad: కరోనా కేసులు కాస్త తగ్గాయో లేదు..ఇప్పుడు హైదరాబాదీలకు మరో సమస్య..