AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shobha Karandlaje: మోదీ కేబినెట్‌లో మహిళలకు పెద్ద పీట.. అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పదవి వరకు..!

Shobha Karandlaje: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ ఏర్పాటైన విషయం తెలిసిందే. సుమారు 12 మంది సీనియర్ మంత్రులు రాజీనామాలు సమర్పించారు..

Subhash Goud
|

Updated on: Jul 08, 2021 | 1:06 PM

Share
Shobha Karandlaje: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ ఏర్పాటైన విషయం తెలిసిందే. సుమారు 12 మంది సీనియర్ మంత్రులు రాజీనామాలు సమర్పించారు. మోదీ కొత్త టీం నిన్న రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తోంది. సుమారు 43 మందితో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకరం చేస్తున్నారు. వారిలో నలుగురు మాజీ సీఎంలు ఉండడం గమనార్హం. 11 మంది మహిళలకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించారు.

1 / 6
ఈ సందర్భంగా మహిళల్లో మంత్రి పదవి దక్కించుకున్న కన్నడ నేత శోభ కరంద్లాజె ఒకరు. ఆమెకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఈమె 1994 నుంచి కర్నాటక బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. దక్షిణ కర్నాటకలోని పుత్తూరులో పుట్టిన ఆమె, చిన్నతనంలోనే ఆరెస్సెస్‌లో చేరారు.

2 / 6
రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పదవుల వరకు వెళ్లారు. ప్రస్తుతం శోభ కర్నాటక బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో ఉడిపి చిక్‌మగళూరు నియోజకవర్గం నుంచి ఆమె వరసగా రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు.

3 / 6
2008-2009, 2010-2012 మధ్య కాలంలో ఆమె యడ్యూరప్ప మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అత్యంత సన్నిహిత నేతల్లో ఆమె ఒకరని చెబుతుంటారు.

4 / 6
బీజేపీ నుంచి విడిపోయి యడ్యూరప్ప ఏర్పాటు చేసిన కర్ణటక జనతా పక్ష పార్టీలో కూడా ఆమె చేరారు. 2014లో కర్నాటక జనతా పక్ష పార్టీ బీజేపీలో విలీనం అయ్యింది. ప్రజాసేవ కోసం తాను వివాహం చేసుకోవడం లేదని ప్రకటించారు. శోభ సోషియాలజీలో ఎం.ఏ చేశారు.

5 / 6
కర్ణాటక బీజేపీ నాయకురాలు, ఉడుపి చిక్‌మంగళూర్‌ నుంచి ఎంపీగా రెండోసారి గెలుపొందారు. 2008-13 మధ్య ఎమ్మెల్యే, కర్ణాటక పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పని చేశారు. రాజకీయాల్లో ప్రజలకు సేవలందిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె మోడీ టీమ్‌లో చోటు దక్కింది.

6 / 6