Viral Photo: నడిచే నెలవంక.. నగుమోము దాచావా కురుల వెనుక.. నిన్ను కనిపెట్టలేమా..?
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్ పుట్టుకోస్తునే ఉంటాయి. డ్యాన్సింగ్ వీడియోస్.. సింగింగ్ వీడియోస్.. ఫేస్ మాస్క్ ఇలా ఒక్కటేమిటీ ఎన్నో సిత్ర.. విచిత్రాలు
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్ పుట్టుకోస్తునే ఉంటాయి. డ్యాన్సింగ్ వీడియోస్.. సింగింగ్ వీడియోస్.. ఫేస్ మాస్క్ ఇలా ఒక్కటేమిటీ ఎన్నో సిత్ర.. విచిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. ఇక సెలబ్రెటీల విషయానికి వస్తే స్టార్ హీరోహీరోయిన్స్ అరుదైన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అందులో చిన్ననాటి ఫోటోస్ కావచ్చు లేదా.. ప్రస్తుతం ఉన్న లేటేస్ట్ ఫోటోస్ కావచ్చు. ఇప్పటికీ వరకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఓ హీరోయిన్ లేటేస్ట్ ఫోటో వైరల్ అవుతుంది. ఈ హీరోయిన్ ఎవరా అనేది గుర్తుపట్టడానికి నెటిజన్స్ తెగ ట్రై చేస్తున్నారు. మీరు గుర్తుపట్టేయండి..
పైన ఫోటోలో కురుల వెనకాల నగుమోము దాచుకున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా ? ఈ హీరోయిన్ పాన్ ఇండియాలోనే క్రేజీ హీరోయిన్. ఉత్తారాది నుంచి దక్షిణాది వరకు ఈమెకు ఫాలోయింగ్ ఎక్కువే. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోయింది.
మీకోసం మరి కొన్ని క్లూస్.. ఈ హీరోయిన్ టాలీవుడ్ కాదండి.. బాలీవుడ్.. వివాహం అనంతరం ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ హీరోయిన్ భర్త కూడా బాలీవుడ్ స్టార్ హీరోనే. ఇప్పుడు ఈ హీరో భర్త తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గుర్తుపట్టగలరా..
పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదండోయ్.. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. కబీ ఖుష్ కబీ హామ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో కరీనా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. చమేలీ, దేవ్, 3 ఇడియట్స్, బాడీగార్డ్, రావన్, భజరంగీ భాయిజాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ను వివాహం చేసుకుంది కరీనా కపూర్.