Deepika Padukone: ఆ స్టార్ హీరో చెప్పిన మాటను లైఫ్‌లాంగ్ గుర్తుంచుకుంటానంటున్న బాలీవుడ్ పద్మావతి
లైఫ్‌లో అన్నీ మనకే తెలియాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొందరిచ్చే సలహాలు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి
Deepika Padukone: లైఫ్‌లో అన్నీ మనకే తెలియాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొందరిచ్చే సలహాలు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. గెహరియాన్ సక్సెస్ జోష్‌లో ఉన్న దీపిక పదుకోన్ లైఫ్ లో కూడా అలాంటి సలహాలున్నాయట. ది బెస్ట్, ది వరస్ట్ అడ్వైజ్‌ల గురించి దీపిక చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. పేరుకు బాలీవుడ్ పద్మావతి అయినా, మన దక్షిణాది అమ్మాయి దీపిక పదుకోన్. ఇప్పుడైతే డార్లింగ్ ప్రభాస్‌తో ప్రాజెక్ట్ కె చేస్తూ తరచూ హైదరాబాద్‌లోనూ హల్‌చల్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఆమె నటించిన సినిమా గెహరియాన్. ఈ సినిమా సక్సెస్ గురించి బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు దీపిక.
ఓ సినిమాకు సంతకం చేయడమంటే కేవలం అదేదో ఓ ఉద్యోగం లాగా చూడవద్దని, ఆ సినిమాకు పనిచేసినన్ని రోజులూ… ఆ సెట్లో తమ జీవితం ఉంటుంది కాబట్టి, బెస్ట్ పీపుల్‌తో అసోసియేట్ అవ్వడానికే ట్రై చేయమని చెప్పారట షారుఖ్. ఈ విషయాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటానని అంటున్నారు దీపిక. షారుఖ్ చెప్పింది బెస్ట్ సలహా అయితే, మరి వరస్ట్ సలహా సంగతేంటి? తన 18వ ఏట అలాంటి సలహాను విన్నానని, కానీ ఆ సమయంలో సొంత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదయిందని చెప్పారు దీపిక. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకుంటే గ్లామర్ ఫీల్డ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఒక వ్యక్తి చెత్త సలహా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారామె. అంతే కాదు… వాళ్లూ వీళ్లూ చెప్పారని కృత్రిమ అందాల వైపు మొగ్గుచూపవద్దని సజెస్ట్ చేశారు దీపిక.
మరిన్ని ఇక్కడ చదవండి :
Kiran Abbavaram: టికెట్టు కొని సినిమా చూసే నన్ను హీరోను చేశాడు.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్..