Allu Arjun: నయా పాన్ ఇండియా స్టార్.. సమ్మర్ నే టార్గెట్ చేస్తున్న అల్లు అర్జున్

ఓ స్టార్ హీరో బ్యాక్‌ టు బ్యాక్‌ ఇండస్ట్రీ హిట్స్ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. అలా వరుస ఇండస్ట్రీ హిట్స్ తరువాత ఆ హీరో మీద ఉండే ప్రెజర్ కూడా మామూలుగా ఉండదు.

Allu Arjun: నయా పాన్ ఇండియా స్టార్.. సమ్మర్ నే టార్గెట్ చేస్తున్న అల్లు అర్జున్
Pushpa
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Mar 04, 2022 | 6:57 PM

Allu Arjun: ఓ స్టార్ హీరో బ్యాక్‌ టు బ్యాక్‌ ఇండస్ట్రీ హిట్స్ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. అలా వరుస ఇండస్ట్రీ హిట్స్ తరువాత ఆ హీరో మీద ఉండే ప్రెజర్ కూడా మామూలుగా ఉండదు. నెక్ట్స్ సినిమా మీద భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. అవి రీచ్ అవ్వడానికి భారీగానే కష్టపడాల్సి ఉంటుంది. ప్రజెంట్ అలాంటి సిచ్యుయేషన్‌లోనే ఉన్నారు నయా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌. ఇండియన్ సినిమాకు బాహుబలి తరువాత అదే రేంజ్‌లో బ్రేక్‌ ఇచ్చిన కమర్షియల్‌ సినిమా పుష్ప. బాహుబలి ఫోక్‌లోర్ మూవీ.. కాస్ట్యూమ్ డ్రామా.. అందుకే పాన్ ఇండియా అప్పీల్ ఈజీ అయ్యింది. కానీ పుష్ప విషయంలో అలా కాదు. పర్ఫెక్ట్‌గా కంటెంట్‌తోనే నేషనల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసింది ఈ మూవీ. సౌత్ ఆడియన్స్‌నే కాదు.. నార్త్‌లోనూ వంద కోట్ల మార్క్‌ రీచ్ అయి సత్తా చాటింది.

ఆల్రెడీ అల వైకుంఠపురములో సినిమాతో టాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్‌… పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల వసూళ్లు సాధించటమే కాదు.. నార్త్‌లో బన్నీకి గ్రాండ్‌ వెల్‌ కం పలికింది. పుష్ప సినిమా బన్నీ టీమ్‌ మీద బాద్యత పెంచింది. దీంతో పుష్ప సీక్వెల్ విషయంతో మరింత కేర్‌ఫుల్‌గా అడుగులు వేస్తున్నారు మేకర్స్‌. ఈ పాటికే సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉన్నా.. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కోసం ఎక్కువ టైం తీసుకొని కథను మరింతగా ఫైన్ ట్యూన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆడియన్స్‌ మనసుల్లో ముద్ర పడిన క్యారెక్టర్‌ కావటంతో.. ఆ పాత్రను మరింత గ్రాండ్‌గా ప్రజెంట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

అందుకే ఆల్రెడీ స్క్రిప్ట్ విషయంలో ఫైనల్‌ కాల్ తీసుకున్న మేకర్స్‌.. ఏప్రిల్‌లో సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి షూటింగ్ కోసమే 8 నెలల సమయం కేటాయిస్తున్నారు. డిసెంబర్‌ కల్లా షూటింగ్ అంతా పూర్తి చేసేలా పర్ఫెక్ట్‌గా షెడ్యూల్స్ ప్లాన్స్‌ చేస్తున్నారు. వన్స్‌ షూటింగ్ కంప్లీట్ అయితే మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసి.. నెక్ట్స్‌ ఇయర్‌ సమ్మర్ బరిలో దిగాలన్నది బన్నీ ప్లాన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kiran Abbavaram: టికెట్టు కొని సినిమా చూసే నన్ను హీరోను చేశాడు.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్..

Bigg Boss OTT: ప్రేక్షకులకు షాక్.. ఆగిపోయిన బిగ్‏బాస్ నాన్‏స్టాప్.. కారణం చెప్పిన నిర్వాహకులు..

Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..