AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మికకు కాబోయే వాడు ఎలా ఉండాలో తెలుసా.? నేషనల్‌ క్రష్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Rashmika Mandanna: పుష్ప (Pushpa) చిత్రంతో ఒక్కసారిగా నేషనల్‌ క్రష్‌గా మారింది నటి రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోందీ బ్యూటీ. ఇదే సమయంలో...

Rashmika Mandanna: రష్మికకు కాబోయే వాడు ఎలా ఉండాలో తెలుసా.? నేషనల్‌ క్రష్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Rashmika
Narender Vaitla
|

Updated on: Mar 04, 2022 | 6:25 AM

Share

Rashmika Mandanna: పుష్ప (Pushpa) చిత్రంతో ఒక్కసారిగా నేషనల్‌ క్రష్‌గా మారింది నటి రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోందీ బ్యూటీ. ఇదే సమయంలో రష్మిక పెళ్లికి సంబంధించి వార్తలు సోషల్‌ మీడియాలో (Social Media) తెగ వైరల్‌ అవుతున్నాయి. మొన్నటి మొన్న రష్మి, విజయ్‌ దేవరకొండ (Vijay Devakonda) వివాహం చేసుంటకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను ఇటు రష్మికతో పాటు అటు విజయ్‌ కూడా కొట్టేపారేశారు. ఇదిలా ఉంటే తాజాగా తన వివాహం విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రష్మిక. ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు నేడు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌గురువారం ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసింది.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘చాలాకాలం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ సినిమా వస్తోంది. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమాను చూడండి. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఇందులోని పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. సినిమాలోని సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. ఇంట్లో వారితో మాట్లాడినట్లే ఉంటాయి. పుష్ప, ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమాల చిత్రీకరణల్లో ఒకేసారి పాల్గొన్నాను.

రెండు పాత్రలకు విభిన్నమైన వస్త్రధారణ ఉన్న కారణంగా డ్రస్సింగ్ విషయంలో మహిళగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వచ్చే జన్మలో నేను కచ్చితంగా అబ్బాయిల పుడతాను’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ . ఇక వివాహంపై ఇటీవల జరుగుతోన్న ప్రచారంపై ప్రశ్నించగా.. రష్మిక మాట్లాడుతూ.. ‘మంచి మనసు, నాకు నచ్చిన వ్యక్తి కనిపిస్తే వెంటనే’ పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే దానికి ఇంకా చాలా సమయం ఉంది అంటూ పెళ్లి టాపిక్‌ను దాటేసిందీ బ్యూటీ.

AlsoRead: Viral Video: బైక్ రైడర్ అవతారమెత్తిన ముఖ్యమంతి.. రెడ్ జాకెట్, సన్‌ గ్గాసెస్‌తో రచ్చ.. వైరల్‌ అవుతున్న వీడియో..

Russia-Ukraine Conflict: ఇక చైనా వంతు.. ఆదేశమే మేయిన్ టార్గెట్.. సంచలన కామెంట్స్ చేసిన ట్రంప్..

Russia Ukraine War: ఆపరేషన్ గంగా వేగవంతం.. ఉక్రెయిన్ నుంచి ఎంతమంది భారతీయులు తిరిగి వచ్చారంటే?