Jawan Movie: షారుక్‌ ‘జవాన్‌’ మూవీపై జీ-20 సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఆంక్షలతో ఆందోళనలో ఫ్యాన్స్‌

పఠాన్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌. ఇప్పుడీ సక్సెస్‌ను కంటిన్యూ చేసేందుకు జవాన్‌ గా మన ముందుకు వస్తున్నాడు. సౌతిండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన జవాన్‌లో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. దీపికా పదుకొణె, విజయ్‌ సేతుపతి, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు వంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు

Jawan Movie: షారుక్‌ 'జవాన్‌' మూవీపై జీ-20 సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఆంక్షలతో ఆందోళనలో ఫ్యాన్స్‌
G20 Summit, Jawan Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 04, 2023 | 2:43 PM

పఠాన్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌. ఇప్పుడీ సక్సెస్‌ను కంటిన్యూ చేసేందుకు జవాన్‌ గా మన ముందుకు వస్తున్నాడు. సౌతిండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన జవాన్‌లో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. దీపికా పదుకొణె, విజయ్‌ సేతుపతి, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు వంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే రిలీజైన టీజర్లు, గ్లింప్స్‌, ట్రైలర్లు జవాన్‌పై అంచనాలను పెంచేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మాస్‌ యాక్షన్‌ మూవీ సెప్టెంబర్‌ 7 న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. నేషనల్ రిపోర్ట్ చూస్తే.. ఇప్పటివరకు దాదాపు 4 లక్షలకు పైగానే టిక్కెట్లు అమ్ముడయ్యాయట. దీనికి తోడు జవాన్ ట్రైలర్‌ క్రియేట్‌ చేసిన బజ్‌ మాములుగా లేదు. దీంతో ఓపెనింగ్‌ రోజే జవాన్‌ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టవచ్చంటున్నారు ఫ్యాన్స్‌. కాగా షారుక్‌ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో మార్నింగ్ షోలు కూడా పడనున్నాయి. ఢిల్లీలోని చాలా థియేటర్లలో ఉదయం 6, 6.15, 6.20కే షారుక్‌ బొమ్మ పడనుంది. ఢిల్లీతో పాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లోనూ ఒక్క రోజులో 17 నుంచి 18 షోలు వేస్తున్నారు

ఇదంతా బాగానే ఉంది కానీ.. జవాన్‌ రిలీజయ్యే తేదీల్లోనే ఢిల్లీలో జీ-20 సమావేశాలు జరగనున్నాయి. ఇప్పుడిదే జవాన్‌కు ప్రతిబంధకంగా మారవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 9-10 తేదీల్లో ఢిల్లీలో G-20 సమ్మిట్ జరగనుంది. దీంతో సెప్టెంబర్‌ 8 నుంచి 10 వరకు మొత్తం మూడు రోజుల పాటు ఢిల్లీలో ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ తేదీల్లో ఢిల్లీలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలకు వరుసగా హాలీడేస్‌ రానున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జవాన్‌ షోలు పడడానికి ఇదే కారణం. అయితే ఇక్కడే ప్రజలకు ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయి. G-20 సమ్మిట్ కారణంగా ఢిల్లీలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి. చాలా మార్గాలను కూడా మూసివేయనున్నారు. మెట్రో స్టేషన్లు కూడా మూతపడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జవాన్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకున్న జనాలు థియేటర్లకు ఎలా చేరుకుంటారనేది ఆందోళన కలిగించే అంశం. అయితే, ఢిల్లీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఢిల్లీ పోలీసులు పదేపదే హామీ ఇస్తున్నారు. అదే సమయంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్‌డేట్స్‌ గురించి తెలుసుకోవాలని సలహాలు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

షారుక్ ఖాన్ జవాన్ ట్రైలర్ తెలుగులో..

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.