Janhvi Kapoor: జాన్వీకపూర్ తొందరపడి నోరుజారింది.. అసలు మ్యాటర్ చెప్పేసిందిగా..
తాజాగా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ 'కాఫీ విత్ కరణ్ 8' ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ కొత్త ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రోమోలో, జాన్వి అనుకోకుండా తన రిలేషన్షిప్ స్టేటస్‌ని బయట పెట్టేసింది. ఎట్టకేలకు ఆమె నోటి నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడి పేరు బయటకు వచ్చింది.

నిర్మాత-దర్శకుడు కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలో పాల్గొనే ప్రతి సెలబ్రిటీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ వైరల్ అవుతున్నారు. ఇంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా అడుగుతుంటుంటాడు. తాజాగా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ‘కాఫీ విత్ కరణ్ 8’ ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ కొత్త ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రోమోలో, జాన్వి అనుకోకుండా తన రిలేషన్షిప్ స్టేటస్‌ని బయట పెట్టేసింది. ఎట్టకేలకు ఆమె నోటి నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడి పేరు బయటకు వచ్చింది.
కరణ్ జోహార్ జాన్వీని తన స్పీడ్ డయల్‌లో ముగ్గురి పేర్లు చెప్పమని అడిగాడు. దానికి జాన్వీ సమాధానమిస్తూ, “పాపా, ఖుషు అలాగే సిఖు” అని త్వరగా చెప్పింది. సిక్కు అంటే శిఖర్ పహారియా. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని వార్తలు వస్తున్నాయి. శిఖర్, జాన్వీలు కూడా కలిసి దైవ దర్శననికి కూడా వెళ్లారు. శిఖర్ పహాడియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. జాన్వీ, శిఖర్ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. కాబట్టి ఇద్దరికీ స్కూల్ నుంచే తెలుసు.
ఈ ఎపిసోడ్‌లో జాన్వీనే కాకుండా ఖుషీ కపూర్‌ని కూడా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించాడు కరణ్. ఖుషీ కపూర్ ‘ది ఆర్చీస్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఖుషీ పేరు ఆమె కో యాక్టర్ వేదాంగ్ రైనాతో రిలేషన్ లో ఉన్నారని టాక్. ఇందులో ఎంత నిజం ఉందని ఖుషీని అడగ్గా, “ఓం శాంతి ఓం సినిమాలోని ఓ సీన్ తెలుసా? ఆ సన్నివేశంలో, ఓం, నేను మంచి స్నేహితులం మాత్రమే అని కొందరు అంటున్నారు అని తెలిపింది. జాన్వీ సినిమాల విషయానికొస్తే.. ఆమె త్వరలో నటుడు రాజ్‌కుమార్ రావు సరసన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’లో కనిపించనుంది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. శరణ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీంతో పాటు జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్‌లతో కలిసి ‘దేవర’ చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
